మరీ ఇంత ఘోరమా ?.. కేవలం ఆరు అంగుళాల భూమి కోసం గొడవ.. ఒకరు హత్య
ఈ మధ్యకాలంలో ఆస్తులు, భూముల కోసం గొడవలు పడి కుటుంబాలు విడిపోతున్నాయి. ఈ గోడవల్లో ఒకరినొకరు ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బిహార్‌లోని 6 అంగుళాల భూమి కోసం జరిగిన వివాదంలో ఒక జవాను చనిపోవడం కలకలం రేపింది.

ఈ మధ్యకాలంలో ఆస్తులు, భూముల కోసం గొడవలు పడి కుటుంబాలు విడిపోతున్నాయి. ఈ గోడవల్లో ఒకరినొకరు ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బిహార్‌లోని 6 అంగుళాల భూమి కోసం జరిగిన వివాదంలో ఒక జవాను చనిపోవడం కలకలం రేపింది. మజఫ్ఫర్‌పూర్ జిల్లా కాంటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే యాదూ ఛాప్రా గ్రామానికి చెందిన దీపేంద్ర కుమార్ సింగ్ (53) అనే వ్యక్తి బిహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్‌లో హవల్డార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పట్నాలో పనిచేస్తున్న అతను ఇటీవల సెలవు తీసుకొని తన గ్రామానికి తిరిగివచ్చాడు. అయితే అక్కడ పక్కింటివారితో కేవలం 6 అంగుళాల భూమి విషయంలో వివాదం రాజుకుంది. ఈ గొడవకు సంబంధించి దీపేంద్ర గత మూడు రోజుల నుంచి పోలీసులుకు ఫోన్ చేసి చెబుతూనే ఉన్నాడు. కానీ పోలీసులు మాత్రం ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు.
దీంతో పక్కింటి వారు సరైన సమయం చూసి దీపేంద్రపై దాడి చేసి హత్య చేశారు. అతడ్ని చూసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం మృతిని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులంతా రహదారిపై ధర్నా చేశారు. దీపేంద్ర హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఆరు అంగుళాల భూమి కోసమే పక్కింటివారు రాహుల్, రాకేష్, శివంలు దీపేంద్రతో గొడవపడ్డారని.. అతని బంధువు ఒకరు తెలిపారు. దీపేంద్రకు చెందిన 6 అంగుళాల భూమిలో పక్కింటివారు ఏదో నిర్మాణం చేయాలనుకున్నారని.. ఈ విషయంలోనే రెండు కుటుంబాలకు గొడవ జరిగిందని చెప్పారు. దీంతో వారు దీపేంద్రను హత్య చేశారని పేర్కొన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..