AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడంటే..!

సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వచ్చినప్పట్నించి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతోందన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మందిర నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేసి, దానికి సుప్రీం తీర్పు ద్వారా పొందిన 2.77 ఎకరాల భూమిని అప్పగించి, మందిర నిర్మాణం జరుపుకోవచ్చన్నది అత్యున్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనమిచ్చిన తీర్పు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గానీ, యుపి రాష్ట్ర ప్రభుత్వం గానీ ట్రస్టును నియమించాలన్నమాట. ఏపీలో టీటీడీ వంటి ఓ ట్రస్టు అయోధ్య రామమందిరం […]

అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడంటే..!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 1:16 PM

Share

సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వచ్చినప్పట్నించి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతోందన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మందిర నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేసి, దానికి సుప్రీం తీర్పు ద్వారా పొందిన 2.77 ఎకరాల భూమిని అప్పగించి, మందిర నిర్మాణం జరుపుకోవచ్చన్నది అత్యున్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనమిచ్చిన తీర్పు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గానీ, యుపి రాష్ట్ర ప్రభుత్వం గానీ ట్రస్టును నియమించాలన్నమాట. ఏపీలో టీటీడీ వంటి ఓ ట్రస్టు అయోధ్య రామమందిరం కోసం ఏర్పాటు చేస్తే.. ఆ ట్రస్టు తీసుకునే నిర్ణయాల మేరకు రామ మందిర నిర్మాణం ప్రారంభించవచ్చు.

అయితే, తీర్పు వచ్చి రెండు నెలలు అయిన నేపథ్యంలో యుపీ ప్రభుత్వం ట్రస్టు నియామకం విషయంలో అడుగులు వేగవంతం చేసినట్లు సమాచారం. అతి త్వరలోనే ట్రస్టు ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి ఆమోదం పొందితే.. ఆ తర్వాత మందిర నిర్మాణానికి సంబంధించిన పనులు అన్నీ లాంఛనాలుగానే మారతాయి. ఎందుకంటే.. మందిరం నమూనాతోపాటు.. నిర్మాణ సామాగ్రి అంతా ఆలయ ప్రదేశంలో చాలా కాలంగా వున్నాయి. మందిర నమూనాకు తుది మెరుగులు దిద్ది.. దానికి కొత్తగా ఏర్పాటయ్యే ట్రస్టు ఆమోదం పొందితే.. ఆ తర్వాత నిర్మాణ పనులకు ఏ అడ్డూ వుండదు.

ఈ తతంగాన్ని మార్చి రెండో వారం నాటికి పూర్తి చేయాలన్నది ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిమతంగా తెలుస్తోంది. దానికి తోడు 2024 పార్లమెంటు ఎన్నికలలోగా అయోధ్యలో భవ్యమైన మందిర నిర్మాణం జరగాలని బీజేపీ అధినాయకత్వం కోరుకుంటోంది. దానికి అనుగుణంగా మందిర నిర్మాణం పూర్తి కావాలంటే.. వీలైనంత త్వరగా మందిర నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి వుంది. దీని ప్రకారం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, మార్చి 25 నుంచి ఏప్రిల్ 2వ తేదీ మధ్య ఓ శుభ ముహూర్తంలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది.

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్