Congress President Elections: ఊపందుకున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసు.. గెహ్లాట్, థరూర్ మధ్యే నెలకొన్న పోటీ?
షెడ్యూల్ దగ్గర పడుతోంది. రంగంలోకి దిగేదేల్యా అని రాహుల్ తేల్చేశారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ ఉంటుందా లేక ఏకగ్రీవ ఎంపిక జరుగుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం..
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. షెడ్యూల్ దగ్గర పడుతోంది. రంగంలోకి దిగేదేల్యా అని రాహుల్ తేల్చేశారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ ఉంటుందా లేక ఏకగ్రీవ ఎంపిక జరుగుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్వరగా ఏఐసీసీ అధ్యక్ష పదవిని సమర్థులకు అప్పగించి ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నారు సోనియాగాంధీ. అయితే రాహుల్ గాంధీ మాత్రం రాను రానంటున్నారు. భారత్ జోడో యాత్ర చేస్తున్న ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మాత్రం ఛోడో అంటున్నారు. దేశం మొత్తం తన పాదయాత్రతో చుట్టేస్తున్న రాహుల్, అధ్యక్ష పదవికి మాత్రం చాలా దూరంగా నడుస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆయనను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ నేతలు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. సంస్థాగత ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని రాహుల్ వాళ్లకు స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ రారు, అధ్యక్ష పదవిని చేపట్టరు అని సీనియర్ నేత జైరామ్ రమేష్ స్పష్టం చేశారు.
అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లు, కేడర్ మాత్రం రావాలి రాహుల్, కావాలి రాహుల్, అధ్యక్ష పదవిని చేపట్టాలి రాహుల్ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీలు రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని వరుసగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. తాజాగా టీపీసీసీ కూడా అదే బాటలో నడిచింది. త్వరలో జరిగే AICC ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాహుల్‌కు మద్దతుగా టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్స్ వేయచ్చు. అక్టోబర్ 17న ఎలక్షన్, 19న ఫలితాలు వెలువడుతాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ , అశోక్ గెహ్లాట్ ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు శశిథరూర్. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీతో భేటీ అయ్యారు
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. పార్టీ ఆదేశిస్తే ఏ పదవి చేపట్టడానికైనా తాను సిద్దమన్నారు గెహ్లాట్. రాహుల్ చెబితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సోనియాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. గాంధీ కుటుంబం అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం