AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకే ఈ దాడి.. ఐక్యమత్యంతో ఉగ్రవాదానికి ఎదుర్కొంటాంః రాహుల్‌

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల లక్ష్యం భారతదేశంలో సోదరభావాన్ని చెడగొట్టడమేనని, కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వంతో కలిసి ఉగ్రవాదంపై పోరాడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

దేశప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకే ఈ దాడి.. ఐక్యమత్యంతో ఉగ్రవాదానికి ఎదుర్కొంటాంః రాహుల్‌
Rahul Gandhi
Balaraju Goud
|

Updated on: Apr 25, 2025 | 4:31 PM

Share

జమ్ముకశ్మీర్‌ లోని పహల్గామ్‌ ఉగ్రదాడిలో గాయపడ్డ వాళ్లను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ పరామర్శించారు. ఉగ్రదాడిలో గాయపడ్డ వాళ్లను ఆస్పత్రిలో ఓదార్చారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమయ్యిందన్నారు రాహుల్‌. అనంతరం జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా , సీఎం ఒమర్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు రాహుల్‌. దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జమ్ముకశ్మీర్‌ ప్రజలను టార్గెట్‌ చేయడం తగదని రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కాంగ్రెస్‌ సమర్ధిస్తుందన్నారు. దేశ ప్రజలను మతం పేరుతో విడగొట్టేందుకే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని రాహుల్‌ మండిపడ్డారు.

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం(ఏప్రిల్ 25) శ్రీనగర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులను కలిశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, సోదరుల మధ్య చిచ్చుపెట్టేందుకే ఉగ్రవాదులు ఈ సంఘటనకు పాల్పడ్డారని, కానీ భారతీయులు ఐక్యంగా ఉన్నారని, ఉగ్రవాదుల ప్రయత్నం విఫలమవుతుందని అన్నారు. ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి, వారికి సహాయం చేయడానికి తాను ఇక్కడికి వచ్చానని రాహుల్ గాంధీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు. దేశం మొత్తం బాధితులకు అండగా నిలుస్తుందన్నారు.

గురువారం(ఏప్రిల్ 24) కేంద్ర ప్రభుత్వంతో అఖిలపక్ష సమావేశం నిర్వహించామని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ఉగ్రవాద దాడిని ఐక్యంగా ఖండించాయని గుర్తు చేశారు. ఉగ్రవాదులపై చర్యకు ప్రతిపక్షం పూర్తిగా మద్దతు ఇస్తుందని సమావేశంలో తన ప్రతిపక్షం ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు.

పహల్గామ్‌లో ఏమి జరిగినా, దాని వెనుక సమాజాన్ని విభజించి, సోదరుల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు. కానీ దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యమన్నారు. ఉగ్రవాదుల ప్రయత్నాలను మనం కలిసికట్టుగా తిప్పికొట్టాలంటే అందరూ కలిసి నిలబడటం ముఖ్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.కాశ్మీర్ తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమందిపై దాడి చేయడం బాధగా ఉందని, మనమందరం కలిసి నిలబడి, ఐక్యంగా ఉండి, ఈ హేయమైన చర్యతో పోరాడి, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడం చాలా ముఖ్యం అని రాహుల్ గాంధీ అన్నారు.

ఆ తర్వాత కాశ్మీర్ ముఖ్యమంత్రి మర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా కలిశారు. వారు ఏమి జరిగిందో వివరించారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున వారికి పూర్తిగా మద్దతు ఇస్తామని వారిద్దరికీ హామీ ఇచ్చానని రాహుల్ అన్నారు. దీనితో పాటు, రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో పార్టీ నాయకులతో కూడా సమావేశం నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..