Bharat Jodo Yatra: అక్కడ భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్.. ఇక్కడ బౌలింగ్ తో ఆకట్టుకున్న రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సెప్టెంబర్ నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో పేరుతో పాదయాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో..
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సెప్టెంబర్ నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో పేరుతో పాదయాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర పూర్తిచేసిన రాహుల్ గాంధీ ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. వేలాది మంది రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈసందర్భంగా యువతతో రాహుల్ గాంధీ ముచ్చటిస్తున్నారు. ఇటీవల మహిళలతో కలిసి నృత్యం చేసిన రాహుల్ గాంధీ, తాజాగా ఓ బాలుడితో కలిసి క్రికెట్ ఆడాడు. ఓ బాలుడు బ్యాటింగ్ చేస్తుండగా, రాహుల్ గాంధీ బౌలింగ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రామచంద్రపురం ఇక్రిశాట్ వద్ద ఓ బాలుడితో క్రికెట్ ఆడారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా బుధవారం జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయి భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ ను ఆసక్తిగా చూస్తున్న వేళ.. తెలంగాణలో రహదారిపై రాహుల్ గాంధీ ఓ బాలుడితో క్రికెట్ ఆడారు.
తెలంగాణలో 7 లోక్‌సభ, 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీ వరకు రాష్ట్రంలో రాహుల్ యాత్ర సాగనుంది. నవంబర్ 4న ఒక రోజు విరామం తీసుకుంటారు. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రోజు కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోనే సాగనుంది. బుధవారం తన పాదయాత్రను ముగించుకున్న తర్వాత ముతంగి వద్ద జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని టీఆర్ ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఆర్ ఎస్ తో తమకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. పొత్తులపై స్థానిక నాయకత్వాలదే నిర్ణయమని తెలిపారు. టీఆర్ ఎస్ తో పొత్తు వద్దని స్థానిక నాయకత్వం తమకు చెప్పిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రిలేషన్‌లో ఉన్నాయని ఆరోపించారు.
#INDvsBAN కంటే మరింత ఆకర్షణీయమైన మ్యాచ్ ఇక్కడ ఉంది చూడండి!
ఈ చిన్ని బ్యాట్స్‌మన్‌కి రాహుల్ గాంధీ గారు బౌలింగ్ చూడండి.#BharatJodoYatra #ManaTelanganaManaRahul pic.twitter.com/718TBy78xR
— Telangana Congress (@INCTelangana) November 2, 2022
ముఖ్యమంత్రికి మధు యాష్కీ బహిరంగ లేఖ
భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం, సీఏం కేసీఆర్ వైఫల్యం చెందారంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. చార్మినార్ వద్ద కనీస భద్రత కల్పించలేదన్నారు.. యాత్ర జరుగుతుంటే లైట్లు ఆపేశారని ఆరోపించారు. పోలీసుల దురుసు చేష్టలతో నాయకులు గాయాలపాలయ్యారన్నారు. సీఆర్పీఎఫ్ భద్రత ఉన్న నేత కు మీరు ఇచ్చే సెక్యూరిటీ ఇదేనా అంటూ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లో భద్రత వలయాన్ని దాటుకుని వచ్చి ఒక వ్యక్తి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నారని ఇంత వైఫల్యం ఉంటుందా అని లేఖలో పేర్కొన్నారు మధుయాష్కీ. యాత్ర జరగబోయే మిగతా రోజుల్లో అయినా రాహుల్ గాంధీకి భద్రత పెంచాలని ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..