AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: కర్నాటకలో ఉచిత బియ్యం రాజకీయం.. కేంద్రం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నిర‌స‌న‌

Anna bhagya scheme: కర్నాటకలో ఉచిత బియ్యం రాజకీయం ఊపందుకుంది. అన్నభాగ్య పథకాన్ని కేంద్ర అడ్డుకుంటోందని కాంగ్రెస్ నిర‌స‌న‌కు దిగింది. పోటీగా బీజేపీ శ్రేణులు కూడా ఆందోళ‌న చేస్తున్నారు.

Bengaluru: కర్నాటకలో ఉచిత బియ్యం రాజకీయం.. కేంద్రం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నిర‌స‌న‌
Karnataka Congress Protest
Ram Naramaneni
|

Updated on: Jun 20, 2023 | 3:04 PM

Share

కర్నాటకలో బియ్యం రాజకీయాలు ఊపందుకున్నాయి. పేద కుటుంబాలలోని ఒక్కొక్కరికి ఉచితంగా 10 కేజీల బియ్యం ఇస్తామన్న అన్నభాగ్య పధకాన్ని కేంద్రం అడ్డుకుంటోందని బెంగళూర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. కావాలనే కేంద్రం కర్నాటకకు బియ్యాన్ని సరఫరా చేయడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాష్ట్రాలకు బియ్యాన్ని కేంద్రం ఎందుకు విక్రయించడం లేదని ప్రశ్నించారు డీకే శివకుమార్‌. అన్న భాగ్య పథకాన్ని అడ్డుకోవడానికే బియ్యం విక్రయాలను నిలిపివేశారని ఆరోపించారు.

అయితే కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ నేతలు కూడా ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు మాజీ సీఎం బస్వరాజ్‌ బొమ్మై. పథకాన్ని అమలు చేయడం చేతకాకపోవడంతో కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు,

బెంగళూర్‌లో ప్రొటెస్ట్ చేస్తున్న బీజేపీ శ్రేణుల‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అన్నభాగ్య పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బియ్యం కొరత తీవ్ర ఆటంకంగా మారింది. తెలంగాణ , ఏపీ ,చత్తీస్‌ఘడ్ సీఎంలతో స్వయంగా మాట్లాడారు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్