‘మేం చెప్పిందే నిజమైందిగా..!’ రఫెల్ ఫైటర్ల అమ్మకం డీల్ పై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్..

'మేం చెప్పిందే నిజమైందిగా..!' రఫెల్ ఫైటర్ల అమ్మకం డీల్ పై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్..
Congress Demands Probe By Jpc In Raphel Fighters Purchase Deal

రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రెంచ్ జడ్జి ఒకరు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీ రఁగంలోకి దిగింది. ఈ అమ్మకం వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 03, 2021 | 4:53 PM

రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రెంచ్ జడ్జి ఒకరు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీ రఁగంలోకి దిగింది. ఈ అమ్మకం వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.(జూన్ 14 న ఫ్రెంచ్ జడ్జి దీనిపై విచారణ ప్రారంభించారు). ఈ సేల్ లో అవకతవకలు, అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ తో సహా పార్టీ లోగడ ఆరోపించిందని..ఇప్పుడు మేం చెప్పిందే నిజమైందని ఈ తాజా పరిణామాలు రుజువు చేశాయని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు జరిపిన పక్షంలోనే ప్రధాన మంత్రికి, ఇతర అధికారులకు కూడా సమన్లు జారీ చేసి కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీయే ఇందుకు తగినదని, అధికారిక డాక్యుమెంట్లను తెప్పించి పరిశీలించగలదని..కానీ సుప్రీంకోర్టుకు అది సాధ్యం కాదని ఆయన అన్నారు. రఫెల్ కేసును విచారించడానికి తాము సరైన అథారిటీ కాదని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. ఫ్రెంచ్ ఎంక్వయిరీ నేపథ్యంలో జేపీసీ విచారణకు ఎప్పుడు అనుమతిస్తారో దేశ ప్రజలకు ప్రధాని చెప్పాలని సూర్జేవాలా డిమాండ్ చేశారు.

రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తుతుందని భావిస్తున్నారు. ఈ డీల్ లో అవినీతి జరిగిందని ఫ్రెంచ్’ మీడియా పార్ట్’ వెబ్ సైట్ ఆరోపించగా.. ఓ జడ్జి చేత దీనిపై ఇన్వెస్టిగేట్ చేయించాలని అక్కడి నేషనల్ ప్రాసిక్యూటర్ల కార్యాలయం కూడా అంగీకరించింది.రఫెల్ అమ్మకం వ్యవహారంలో ఆ దేశ వైమానిక సంస్థ దసాల్ట్ కి రిలయన్స్ గ్రూప్ ని భాగస్వామిగా చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం నాడు నిర్ణయించింది. అసలు ఈ డీల్ లో ఫ్రాన్స్ కి ఎలాంటి పాత్ర లేదని ఆ దేశ మాజీ ప్రధాని ఫ్రాంకోయిస్ హాలండే లోగడ వ్యాఖ్యానించారు..

మరిన్ని ఇక్కడ చూడండి: సినీ ఫక్కీలో క్రిమినల్ అరెస్ట్..!గ్యాంగ్‌స్టర్‌‌‌ను చుట్టుముట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు..ట్రెండ్ అవుతున్న వీడియో:police video.

నీటి మంటలు సాగర్‌లో టెన్షన్‌.. రోజు రోజుకు ముదురుతున్న జలవివాదం..రంగంలోకి దిగిన పోలీసులు..:controversy on water projects video.

జనసంచారంలో మొసలి విహారయాత్ర..! వీధుల్లో మొసలి తీరుగుతున్న షాకింగ్ వీడియో వైరల్:crocodile romeing on roads video.

నడిరోడ్డు పై యువకుడు గన్ తో హల్ చల్..!అందరూ చూస్తుండగానే కాల్చాడు.. వెళ్ళిపోయాడు..:Man gun fire at wine shop Video.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu