PM Modi: ఈ సారి టీఎంసీ పతనం ఖాయం.. బెంగాల్ ప్రచారంతో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ తొలి విడత పోలింగ్‌పై రెండో విడత ఎన్నికల ప్రచారంతో ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేననీ దీమా వ్యక్తం చేశారు. టీఎంసీ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. బీజేపీ పాలనలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ సారి టీఎంసీ పతనం ఖాయమన్నారు.

ఐదురాష్ట్రాల ఎన్నికలల్లో భాగంగా ఇప్పటికే తొలి విడత ఎన్నికలు పూర్తి పశ్చిమబెంగాల్ రెండో విడత ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇక తొలివితలో పోలింగ్ శాతాన్ని బట్టి ఆయా రాజకీయా పార్టీలు సైతం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని సాగిస్తున్నారు. తాజాగా రెండో విడత ఎన్నికల ప్రచారంలో బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. నార్త్ 24 పరగణలో ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ తొలి విడత పోలింగ్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ పాలనకు బెంగాల్ ప్రజలు తొలిదశ పోలింగ్‌లో గుణపాఠం చెప్పారని అన్నారు మోదీ.
బెంగాల్‌లో మహా జంగిల్ రాజ్ అంతమవుతుందని, బీజేపీ పాలనలో మహిళకు రక్షణ ఉంటుందన్నారు. బెంగాల్ ప్రజలకు టీఎంసీ అత్యాచారాల నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందన్నారు మోదీ. నార్త్ 24 పరగణలో బీజేపీ అభ్యర్ధిగా ఆర్‌జీ ఖార్ హాస్పిటల్ మృతురాలి తల్లి పోటీ చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. తన కూతురిని డాక్టర్ చేయాలని అనుకున్న తల్లికి మమత సర్కార్ అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరే బిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామన్నారు.
మరోవైపు బెంగాల్‌లో తొలిదశ పోలింగ్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిదశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ 110 స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఈసారి టీఎంసీకి ఓటమి ఖాయమన్నారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. రెండో విడత పోలింగ్‌లో కూడా ఓటర్లు బీజేపీకే పట్టం కడుతారని అమిత్‌షా స్పష్టం చేశారు.
మోదీ ఏమన్నారో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
