AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్

దేశం సంపదను కొల్లగొట్టి విదేశాల్లో వెళ్లి తలదాచుకుంటున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో భారత ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలతో కేవలం ఐదేళ్లలోనే సుమారు 36 దేశాలకు పరిపోయిన 274 మంది పరారీ నేరస్థులను కేంద్ర సర్కార్ తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది.

విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్
India Fugitive Extradition 2021 2026
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 3:46 PM

Share

దేశ సంపదను దొచుకొని విదేశాల్లో తలదాచుకుంటున్న కేటాగాళ్లను పట్టుకొని శిక్షలు విధించడంలో భారత ప్రభుత్వం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో 2021-2026 మధ్య కాలంలో దాదాపు 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను తిరిగి భారత్‌కు తీసుకొచ్చంది. దేశ సంపదను కొళ్లగొట్టే నేరస్థులకు తగిన శిక్ష పడేలా.. 2018లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం.. భారత్ పరారీ నేరస్థులను ఎదుర్కోవడానికి పటిష్టమైన, నిఘా, సాంకేతికత ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసింది. గత ప్రభుత్వాల్లో లోపించిన రాజకీయ సంకల్పాన్ని అధిగమిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పరారీ నేరస్థులను తిరిగి తీసుకురావడాన్ని ఒక జాతీయ ప్రాధాన్యతగా మార్చి మిషన్ మోడ్’లో పనిచేస్తోంది.

మూడు కీలక అంశాలతో మోదీ ప్రభుత్వ వ్యూహం

దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు,జాతీయ భద్రతలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం మూడు కీలక సిద్ధాంతాలతో వ్యూహాన్ని అమలు చేస్తోంది. పరారీ నేరస్థుల అప్పగింత వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చట్టపరమైన నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా దేశంలోని 1,400కు పైగా దర్యాప్తు సంస్థలను ఇంటర్‌పోల్‌తో అనుసంధానిస్తూ ప్రభుత్వం ‘భారత్‌పోల్’ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల సమాచార మార్పిడికి పట్టే సమయం 3 నుండి 10 రోజులకు తగ్గింది.

అలాగే విదేశాల్లో దాక్కున్న వారిని పట్టుకునేందుకు జారీ చేసే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రధాని మోదీ హాయంలో గణనీయంగా పెరిగింది గడిచిన మూడేళ్లలోనే 401 మంది పరారీ నేరస్థులపై ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. 2019లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సవరణ చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ (UAPA) సవరణ చట్టాలను అమల్లోకి తెచ్చారు. ఈ కొత్త క్రిమినల్ చట్టాల్లో నిందితుల అప్పగింతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS)లోని సెక్షన్ 355, 356 ద్వారా నిందితుడు దేశంలో అందుబాటులో లేనప్పటికీ విచారణ జరిపే సదుపాయం తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది

ఆర్థిక రికవరీ ‘ఆపరేషన్ త్రిశూల్’

మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని (PMLA) కఠినంగా అమలు చేయడం ద్వారా 2019 నుంచి 2026 మధ్య పరారీ నేరస్థులకు చెందిన రూ. 17,874 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. అదేవిధంగా, దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న నిధులతో కలిపి మొత్తం రూ. 18,762 కోట్ల మేర విజయవంతంగా రికవరీ చేశారు. అంతేకాకుండా, ఆపరేషన్ త్రిశూల్ ద్వారా విదేశాల్లో పేర్లు, గుర్తింపులు మార్చుకుని దాక్కున్న పరారీ నేరస్థుల ఆచూకీని ఉపగ్రహ సాంకేతికత, డిజిటల్ ఫుట్‌ప్రింట్ల సాయంతో సమర్థవంతంగా గుర్తిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!