AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా? ఉద్యోగం పోయినట్టేనా..?

ఇటీవలి కాలంలో ప్రముఖ ఐపీఎస్ అధికారులు ఉదయ్ కృష్ణ రెడ్డి, విశాల్ గున్ని కేసుల నేపథ్యంలో ‘ఐపీఎస్ సస్పెన్షన్’ అనే అంశం విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. సస్పెన్షన్ అనేది ఒక ఉన్నతాధికారి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దాని పరిణామాలు ఏమిటి? యూపీఎస్సీ ఆశావహులు ఈ విషయాల నుంచి ఏమి నేర్చుకోవచ్చు అనే అంశాలపై సర్వత్రా చర్చ సాగుతుంది..

IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా? ఉద్యోగం పోయినట్టేనా..?
IPS Officer Suspension Rules
Srilakshmi C
|

Updated on: Aug 04, 2026 | 5:30 PM

Share

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణ రెడ్డి ప్రస్తుత వివాదంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. కోర్టు విచారణలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో నిజానిజాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తొందరపడి తీర్పు చెప్పవద్దని, ఉదయ్ కృష్ణ రెడ్డి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని కొందరు వాదిస్తున్నారు. అటు కాదంబరి జత్వాని వివాదంలో విశాల్ గున్ని సస్పెండ్ అయ్యి రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నారు. ఈ రెండు కేసులు ఐపీఎస్ సస్పెన్షన్‌పై చర్చకు దారి తీశాయి. నిజానికి ఐపీఎస్ అధికారికి గణనీయమైన అధికారాలు, ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో అధికారం, గౌరవం, మంచి జీతం, అధికారిక వాహనం, భద్రత, వైద్య ప్రయోజనాలు, వివిధ అలవెన్సులు, ప్రభుత్వ నివాసం వంటివి ఉంటాయి. ఏఎస్పీ (అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) నుంచి ఎస్పీ, డీఐజీ, ఐజీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వంటి ఉన్నత స్థాయి పదవులకు ఎదిగే అవకాశం ఉంటుంది.

ఐపీఎస్ సస్పెన్షన్ అంటే..?

సస్పెన్షన్ అనేది ఉద్యోగం నుంచి తొలగింపు (డిస్మిసల్) కాదు. ఇది తాత్కాలికంగా విధులను నిలిపివేయడం. సస్పెన్షన్‌లో ఉన్న అధికారికి అధికారిక విధులు ఉండవు. ప్రభుత్వ క్వార్టర్లు, ఇతర అధికారిక ప్రయోజనాలు నిలిపివేయబడతాయి. పూర్తి జీతానికి బదులుగా కొంత తగ్గించిన జీతం మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా, ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. అధికారుల వ్యక్తిగత ప్రతిష్ట, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, క్రిమినల్ కేసులలో నేరం రుజువైతే, అప్పుడు డిస్మిసల్ అంటే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. గతంలో ఇలా ఉద్యోగాలు కోల్పోయిన అధికారులు కూడా చాలా మంది ఉన్నారు.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ ఆశావహ అభ్యర్ధులు తెలుసుకోవల్సిన విషయాలు

యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి ఉన్నత పదవులు పొందిన తర్వాత కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కష్టపడి పైకి ఎదిగినప్పటికీ, ఒక చిన్న తప్పు లేదా తప్పుడు నిర్ణయం మొత్తం కెరీర్‌ను ప్రభావితం చేస్తుంది. అశోక్ నగర్‌లోని కొన్ని యూపీఎస్సీ కోచింగ్ సంస్థలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే స్కామ్‌స్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తమ కెరీర్‌ను పాడుచేసుకోకుండా, నిబద్ధతతో, నిజాయితీతో పనిచేయాలని యూపీఎస్సీ ఆశావహులు గుర్తుంచుకోవాలి. చివరగా, చట్టం అందరికీ సమానం. ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే, చట్టపరమైన చర్యలు తప్పవు. నిజానిజాలు తేలే వరకు తొందరపడి ఎవరినీ నిందించకుండా, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచడం ముఖ్యమని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి.

Follow Us
పంత్ గాయంపై క్లారిటీ.. జైస్వాల్ గొడవపై కోచ్ ఏమన్నారంటే..?
పంత్ గాయంపై క్లారిటీ.. జైస్వాల్ గొడవపై కోచ్ ఏమన్నారంటే..?
భారత ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి
భారత ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి
లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ 7 వస్తువులు ఇంట్లో ఉన్నాయా?
లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ 7 వస్తువులు ఇంట్లో ఉన్నాయా?
పాక్‌ పై చక్కర్లు కొట్టిన టర్కీ యుద్ధ విమానాలు.. ఏం జరుగుతోంది?
పాక్‌ పై చక్కర్లు కొట్టిన టర్కీ యుద్ధ విమానాలు.. ఏం జరుగుతోంది?
చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం చెప్తోందిదే
చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం చెప్తోందిదే
చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన తండ్రి
చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన తండ్రి
ఇంట్లో వైఫై సరిగ్గా రావడం లేదా..? ఈ మూడు ట్రిక్స్ చాలు..
ఇంట్లో వైఫై సరిగ్గా రావడం లేదా..? ఈ మూడు ట్రిక్స్ చాలు..
పచ్చిమిర్చి చికెన్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
పచ్చిమిర్చి చికెన్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం
మెచ్యూర్ కానీ అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ