కోయంబత్తూరులో ఘనంగా సామూహిక వివాహాలు.. వధూవరులకు పెళ్లి బట్టలు, గృహ సామాగ్రి అందజేసీన సీఎం పళనిస్వామి

మాజీ ముఖ్యమంత్రి జయలలిత 73వ జయంతి పురస్కరించుకుని కోయంబత్తూర్‌లో సోమవారం 123 జంటలకు జరిగే సామూహిక వివాహ నిర్వహించారు.

  • Balaraju Goud
  • Publish Date - 3:14 pm, Mon, 15 February 21
కోయంబత్తూరులో ఘనంగా సామూహిక వివాహాలు..  వధూవరులకు పెళ్లి బట్టలు, గృహ సామాగ్రి అందజేసీన సీఎం పళనిస్వామి

Coimbatore mass Marriages :  పేద మహిళలకు ఏటా ఉచితంగా నిర్వహించే సామూహిక వివాహం కార్యక్రమం కోయంబత్తూరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత 73వ జయంతి పురస్కరించుకుని కోయంబత్తూర్‌లో సోమవారం 123 జంటలకు జరిగే సామూహిక వివాహ నిర్వహించారు. కైంబాటూర్ సబర్బన్ సౌత్ జిల్లా కార్యదర్శి, హోం వ్యవహారాల మంత్రి ఎస్.బి. వేలుమణి నేతృత్వంలోని ప్రతి ఏటా ఈ వివాహలు చేపట్టారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంలు పాల్గొన్నారు. కోవై శిరువాణి రోడ్డు సమీపంలో ఉన్న పేరూర్‌శెట్టిపాళయంలో వివాహాల కోసం భారీ పందిరి వేశారు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల్లోపు జరిగే ఈ వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొని తాళిబొట్టును అందజేశారు.

జయలలిత 73వ జయంతి సందర్భంగా 73 జంటలకు ఉచిత వివాహాలు చేయాలని నిర్ణయంచగా, 123 జంటలు పేర్లు నమోదు చేసుకున్నారు. వధూవరులకు మంచం, దుప్పట్లు, దిండ్లు, బీరువా, సూట్‌కేస్‌, గ్యాస్‌ స్టవ్‌, ఫ్యాన్‌, కుక్కర్‌ సహా పలురకాల వంటపాత్రలు, పూజా సామగ్రి తదితర 73 రకాల వస్తువులు అందజేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వధూవరుల బంధువులు, స్నేహితులకు విందుభోజనం కూడా ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర మంత్రి వేలుమణి తెలిపారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.