AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాయపడిన ఏనుగును చూసి చలించిపోయిన రాహుల్‌ గాంధీ.. రక్షించాలంటూ సీఎంకు లేఖ

గాయపడిన పిల్ల ఏనుగు దాని తల్లితో కలిసి బాధాకరమైన దృశ్యాన్ని మేము చూశాము. నేను రాజకీయ హద్దులు దాటి, జోక్యం చేసుకుని చిన్న ఏనుగును రక్షించాల్సిందిగా కోరుతున్నాను..

గాయపడిన ఏనుగును చూసి చలించిపోయిన రాహుల్‌ గాంధీ.. రక్షించాలంటూ సీఎంకు లేఖ
Rahul Gandhis Letter
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2022 | 1:59 PM

Share

గాయపడిన ఏనుగు పరిస్థితిని చూసి చలించిపోయారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఈ మేరకు ఆ ఏనుగుకు అత్యవసర వైద్య సంరక్షణ అవసరమని కోరుతూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాశారు. సోనియా గాంధీతో కలిసి బెంగళూరులోని నాగరహోళే టైగర్‌ రిజర్వ్‌(ఎన్టీఆర్‌)ను సందర్శించిన రాహుల్‌ గాంధీ తోక, తొండం తీవ్రంగా గాయపడిన ఏనుగు పిల్లను రక్షించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి విజ్ఞప్తి చేశారు. ప్రాణాలతో పోరాడుతున్న ఈ ఏనుగును తాను చూశానని సీఎంకు రాసిన లేఖలో రాహుల్‌ పేర్కొన్నారు. గాయపడిన పిల్ల ఏనుగు దాని తల్లితో కలిసి బాధాకరమైన దృశ్యాన్ని మేము చూశాము. నేను రాజకీయ హద్దులు దాటి, జోక్యం చేసుకుని చిన్న ఏనుగును రక్షించాల్సిందిగా మీ కరుణా భావానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను అని లేఖలో పేర్కొన్నారు. అతను తల్లి ఏనుగు, గున్న ఏనుగు ఫోటోలను కూడా పంపారు. సరైన చికిత్స అందిస్తే అది బతికేస్తుందని నాకు నమ్మకం ఉందన్నారు. చిన్న ఏనుగును రక్షించేందుకు సకాలంలో సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ రాహుల్‌ కోరారు.

కాగా, రాహుల్‌ గాంధీ రాసిన లేఖపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. ఈ రోజు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నాగర్‌హోళె అడవుల్లో పర్యటించిన సందర్భంగా తోక, తొండంపై గాయాలతో ఏనుగు, దాని తల్లి ఉండటాన్ని గమనించి దీనిపై లేఖ రాశారని చెప్పారు. సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి ఏనుగులకు ఎలాంటి చికిత్స అందించాలో పరిశీలిస్తామన్నారు. తన దృష్టికి తీసుకెళ్లిన విషయంపై స్పందిస్తామని, మానవతా దృక్పథంతో ఇది అవసరమని అన్నారు.

ఇవి కూడా చదవండి
Rahul Gandhis

భారత్ జోడో ప్రచారంలో పాల్గొనడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ , పార్టీ ముఖ్యులందరూ తమ పార్టీ కోసమే పని చేస్తారని అన్నారు. సోనియా గాంధీ అర కి.మీ నడిచి తిరిగి వచ్చారు. ఇవేవీ ప్రభావం చూపవు. ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొనడంతో మాకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఎలాంటి పరిణామాలు ఉండవని అన్నారు. భారత్ జోడో ప్రచారానికి ముందు నిర్ణయించిన ప్రకారం బీజేపీ ఆరు ర్యాలీలు నిర్వహించనుంది. మధ్యమధ్యలో సభ, దసరా ఉన్నందున మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పతో కలిసి ఉమ్మడి పర్యటన ప్రారంభిస్తామన్నారు. మాండ్యలో జరిగిన పోలీసుల దాడి కేసుకు సంబంధించి అక్కడ ఎవరు తప్పు చేశారో తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..