Dogs Attack: వీధి కుక్కల దండయాత్ర.. చిన్నారిని వెంటాడి.. వేటాడి మరి కరిచాయ్.. పాపం చిన్నారి..
Stray dogs attack: వీధి కుక్కలు మనుషులపై దండయాత్ర చేస్తున్నాయి. అది కూడా మామూలుగా కాదూ.. వెంటపడి వేటాడి పళ్లతో రక్కేస్తూ రక్తం కళ్లజూస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలూ.. కరిచివేత ఖాయమన్నట్టుగా రెచ్చిపోతున్నాయి.
Stray dogs attack: వీధి కుక్కలు మనుషులపై దండయాత్ర చేస్తున్నాయి. అది కూడా మామూలుగా కాదూ.. వెంటపడి వేటాడి పళ్లతో రక్కేస్తూ రక్తం కళ్లజూస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలూ.. కరిచివేత ఖాయమన్నట్టుగా రెచ్చిపోతున్నాయి. అరుపులు కేకలు వేసినా లెక్కచేయకుండా మీదపడి రక్కేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తున్న కుక్కలు.. కలియబడి కరుస్తున్నాయి. కేరళలోని కన్నూర్ వీధిలో కుక్కల స్వైరవిహారం ఒంట్లో వణుకు పుట్టించింది. 9ఏళ్ల శాన్వీపై మూడు కుక్కలు దాడి చేసిన తీరు భయబ్రాంతులకి గురి చేసింది. మీదపడి దాడి చేసేది కుక్కలేనా? అంతకుమించి మృగాలా అన్నట్టుగా అనిపించింది. మూడు వైపులా శాన్వీ మీద పడి నోటికి పనిచెప్పాయి. రక్తం కారుతున్నా.. చిన్నారి గావుకేకలు పెట్టినా వదల్లేదు.
గేటు తీసి ఇంట్లోకి వెళ్లింది శాన్వీ. ఆమె వెంటే ఒకదాని వెనుక మరొకటి.. మూడు కుక్కలు ఇంట్లోకి వెళ్లాయి. వెళ్తూ వెళ్తూనే ఆమెపై దాడి చేశాయి. తల వెంట్రుకలు, కాళ్లు, నడుము భాగంలో శరీరాన్ని పీకేస్తూ లాక్కెళ్లేందుకు ప్రయత్నించాయి. శాన్వీ అరుపులు విన్న ఓ వ్యక్తి గోడపై నుంచి ఏం జరుగుతుందో గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. వెంటనే అరుస్తూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఓ మహిళ గేటు తీసి ఇంట్లోకి వెళ్లింది. గట్టిగా అరుస్తూ వెళ్లడంతో కుక్కలు పారిపోయాయి. కిందపడ్డ శాన్వీని పైకి లేపి తీసుకెళ్లింది. ఇరుగుపొరుగు అప్రమత్తం కావడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. కానీ అప్పటికే మెడ, చేతులు, కాళ్లపై లోతైన గాయాలు కావడంతో శాన్వీని హాస్పిటల్‌కి తరలించారు.
అదే స్పాట్‌లో మూడు రోజుల క్రితం 11ఏళ్ల నిహాల్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. విచక్షణారహితంగా కరిచేయడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. దీంతో స్పాట్‌లోనే బాలుడు చనిపోయాడు. ఆ విషాద ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో చిన్నారిపై కుక్కలు దాడి చేయడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. వీధి కుక్కల దాడితో స్థానికులంతా ఉలిక్కిపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కుక్కలు మీదపడి ఎటాక్ చేస్తాయోనని వణికిపోతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..