Supreme Court: సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ వెబ్‌సైట్.. అప్రమత్తంగా ఉండాలంటూ కీలక సూచనలు చేసిన చీఫ్ జస్టీస్
ఈ మధ్య సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తూ డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరించినా కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట చోటుచేసుకుంటునే ఉన్నాయి. ఇప్పటిదాకా వివిధ సంస్థలు, వ్యక్తులు, బ్రాండ్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి.. వ్యక్తిగత సమాచారం తస్కరిస్తున్న ఈ కేటుగాళ్లు కొత్త రూట్లు వెతుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టునే టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ మధ్య సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తూ డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరించినా కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట చోటుచేసుకుంటునే ఉన్నాయి. ఇప్పటిదాకా వివిధ సంస్థలు, వ్యక్తులు, బ్రాండ్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి.. వ్యక్తిగత సమాచారం తస్కరిస్తున్న ఈ కేటుగాళ్లు కొత్త రూట్లు వెతుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టునే టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు పేరు మీద ఓ నకిలీ వెబ్‌సైట్‌ను తయారుచేశారు. ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ఈ వైబ్‌సైట్ విషయంలో లాయర్లు, వ్యాజ్యదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కూడా దీనిపై పబ్లక్ నోటీసును జారీ చేసింది.
అయితే ఆ నకలీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో రెండు యూఆర్ఎల్‌లను కూడా జనరేట్ చేశారు. దీంతో ఈ వెబ్‌సైట్‌ను వినియోగించి.. వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీటిని ఎవరూ కూడా షేర్ చేయకూడదని.. అందులో తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తమ నోటీసులో పేర్కొంది. అంతేకాదు.. సుప్రీం రిజిస్ట్రీ కూడా ఎన్నడూ ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారం కోరదని.. రహస్య వివరాలు అడగదని చెప్పింది. అలాగే ఆర్థిక లావాదేవీల గురించి కూడా అడగదని తమ నోటీసులో తెలిపింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఉండియా వెబ్‌సైట్ అనేది www.sci.gov.in అనే డొమైన్‌తో రిజిస్టర్ అయ్యి ఉంటుంది. అయితే ఈ కోర్టు పేరుతో ఏదైనా యూఆర్‌ఎల్ వస్తే దాన్ని క్లిక్ చేసే ముందు ఒరిజినల్ డొమైన్‌తో సరిచూసుకోవాలని తెలిపింది.
ఒకవేళ మీరు సైబర్ దాడికి గురైనట్లైతే.. వెంటనో అన్ని ఆన్‌లైన్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని రిజిస్ట్రీ సూచనలు చేసింది. మరో విషయం ఏంటంటే ఇప్పటికే ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొంది. అలాగే దీని వెనుక ఉన్న సైబర్ నేరగాళ్లను కూడా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా.. అటూ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ కూడా ఇందుక సంబంధించిన విషయంపై ప్రజలను హెచ్చరించారు. సైబర్ కేటుగాళ్లు రూపొందించే ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. సుప్రీంకోర్టు పేరుతో వస్తున్న ఆ లింక్‌లను అస్సలు క్లిక్ చేయకూడదని చెబుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే దాన్ని నగదు లావాదేవీల కోసం వినియోగించకూదని.. న్యాయవాదులు, వ్యాజ్యదారులకు ఆయన సూచనలు చేశారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం




