ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి.. సడెన్‌గా చిరుతపులి ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
వాల్పరైలోని టీ ఎస్టేట్‌లో ఘోర ఘటన. నాలుగు సంవత్సరాల బాలిక రోష్నిని చిరుతపులి లాక్కెళ్లింది. తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పనిచేస్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై చిరుత దాడి చేసింది. గంటల తరబడి గాలింపు చర్యలు జరిగాయి కానీ, బాలిక ఆచూకీ దొరకలేదు.

తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పని చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఆడుకోమని చెప్పి.. అక్కడికి కొద్ది దూరంలోనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో రాకాసి చిరుత.. పాపం.. ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని.. అడవుల్లోకి లాక్కెళ్లింది. ఈ ఘటన వాల్పరైలో శుక్రవారం సాయంత్రం జరిగింది. నాలుగు సంవత్సరాల బాలికను చిరుతపులి లాక్కెళ్లిన ఘటన సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్‌లోని వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్‌లోని సౌత్ డివిజన్‌లో చోటు చేసుకుంది. చిన్నారి రోష్ని, జార్ఖండ్‌కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుండ్ కుమార్తె.
ఆమె ఇంటి ముందు ఆడుకుంటుండగా సమీపంలోని టీ తోట నుండి ఒక చిరుతపులి వచ్చి ఆమెపై దాడి చేసి, ఆమెను లాక్కెళ్లింది. ఈ సంఘటనను గమనించిన ఎస్టేట్ కార్మికులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు. దీంతో రోష్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీ ఎస్టేట్‌లో పనిచేసేందుకు పాపం వారు గత ఆదివారమే పని కోసం జార్ఖండ్ నుండి వాల్పరైకి వచ్చారు. ఇంతలో తమ చిన్నారికి ఇలా జరిగింది. చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లిన పులి.. ఆమెను ఏం చేసి ఉంటుందో అని అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
