AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రేపు జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం, పొన్నవరం పరవశం

NV Ramana : సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు‌. 48వ సీజేగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో కృష్ణా జిల్లాలో ఆయన పుట్టిన గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రేపు జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం, పొన్నవరం పరవశం
N V Ramana
Venkata Narayana
| Edited By: Phani CH|

Updated on: Apr 23, 2021 | 9:48 PM

Share

Chief Justice NV Ramana : సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు‌. 48వ సీజేగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో కృష్ణా జిల్లాలో ఆయన పుట్టిన గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‌ దేశ అత్యున్నత న్యాయవవస్థకు అధినాయకత్వం వహించే అవకాశం రావడంతో ఎన్వీ రమణ పుట్టిన పల్లె పరవశించిపోతోంది. ఇక, మన తెలుగు బిడ్డ దేశ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపడుతుండంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాబ్డే పదవి కాలం పూర్తి కావడం, సీజేగా రాష్ట్రపతి ఆమోద ముద్రవేయడంతో రేపు సుప్రీం కోర్ట్ 48వ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ బాధ్యతలు అందుకోనున్నారు‌. 16 నెలల పాటు ఆయన సీజేగా సేవలు అందించనున్నారు‌. ఇక, ఎన్వీ రమణ నేపథ్యాన్ని చూస్తే ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న అడ్వకేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవ, ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ సేవలందించారు. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీజేగా బాధ్యతలు స్వీకరించి 2022 ఆగష్టు 26వరకు ఆయన సేవలు అందించనున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Sangam Dairy : సంగం డైరీ చైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు : ఏసీబీ

Indonesia submarine: ఇండోనేషియా జలాంతర్గామి కోసం ఆగని వెతుకులాట..అందులో ఆక్సిజన్ అయిపోతుందేమో అనే టెన్షన్..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే