మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 66,836 పాజిటివ్‌ కేసులు.. మరణాలు ఎన్నంటే..!

Maharashtra Corona Update: దేశంలో కరోనా కొరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భయాందోళన నెలకొంది. ఇక మహారాష్ట్రలో అయితే...

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 66,836 పాజిటివ్‌ కేసులు.. మరణాలు ఎన్నంటే..!
Maharashtra Corona Update
Follow us

|

Updated on: Apr 23, 2021 | 9:44 PM

Maharashtra Corona Update: దేశంలో కరోనా కొరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భయాందోళన నెలకొంది. ఇక మహారాష్ట్రలో అయితే పాజిటివ్‌ కేసులు మాత్రం రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గురువారం నుంచి శుక్రవారం వరకు గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 66,836 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 773 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,61,676కు చేరగా, మొత్తం మరణాలు 63,252కు చేరాయి.

మరో వైపు గడిచిన 24 గంటల్లో 74,046 మంది కరోనాతో కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు కోవిడ్‌తో కోలుకున్న వారి సంఖ్య 34,04,792కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,91,851 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

ఇక దేశంలో మరో మూడు వారాల తర్వాతగానీ పీక్‌ స్థానానికి చేరబోదని ఐఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే 11-15 తేదీల మధ్య వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయని, అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. అంతేకాదు, ఏప్రిల్ 25-30 కల్లా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణా రాష్ట్రాల్లో కొత్త కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో ఇప్పటికే కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే మే నెలాఖరుల కల్లా కేసులు బాగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తల అంచనా.

కాగా, గత ఏడాది కంటే ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ కరోనా తీవ్ర రూపం దాల్చుతుంది. దేశంలో లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. తీవ్రంగా నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కూడా కొనసాగుతోంది.

ఇవీ చదవండి: Corona Effect: భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం.. సంచలన నిర్ణం తీసుకున్న సింగపూర్‌

India Covid: కరోనా విలయం.. కోవిడ్ కేసులు మే 15 కల్లా పతాక స్థాయికి.. ఐఐటీ శాస్త్రవేత్తల కీలక రిపోర్టు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు