AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. దేశ వ్యాప్తంగా భారీగా తగ్గిన చికెన్, ఎగ్స్ ధరలు.. వివిధ రాష్ట్రాల్లో..

Bird Flu Effect: దేశంలో బర్డ్ ఫ్లూ వల్ల చికెన్, ఎగ్స్ ధరలు విపరీతంగా పడిపోయాయి. వినియోగదారులు ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో

Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. దేశ వ్యాప్తంగా భారీగా తగ్గిన చికెన్, ఎగ్స్ ధరలు.. వివిధ రాష్ట్రాల్లో..
uppula Raju
|

Updated on: Jan 10, 2021 | 11:15 AM

Share

Bird Flu Effect: దేశంలో బర్డ్ ఫ్లూ వల్ల చికెన్, ఎగ్స్ ధరలు విపరీతంగా పడిపోయాయి. వినియోగదారులు ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో వ్యాపారులు దిగాలు చెందుతున్నారు.గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాలను బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వణికిస్తోంది. ఇప్పటికే ఏవియన్‌ ఇన్‌ప్లూయెంజా వైరస్‌ బారిన పడిన వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. అటు లక్షలాది సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ వైరస్‌ కంటే దాని మీదున్న భయం వేగంగా విస్తరిస్తోంది. దీంతో అమ్మకాలు భారీగా తగ్గాయి.

దేశ రాజధాని ఢిల్లీలో చికెన్‌ ధరలు పడిపోయాయి. ఘాజీపూర్‌ మండిలో చికెన్‌ రేట్లు 40-50 శాతం తగ్గాయి. అయినప్పటికీ ఎవరూ కొనేందుకు ముందుకురావడం లేదు. గతంలో లైవ్‌ చికెన్‌ను వంద రూపాయాలకు అమ్మిన వ్యాపారులు ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలకే అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనూ బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. ఇక్కడ ధరలు 25-30 శాతం పడిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత వారం ఇక్కడ 150-200 రూపాయలకు అమ్ముడుపోయిన కేజీ చికెన్‌ ఇప్పుడు 130-140 రూపాయలకే అమ్మడవుతోంది. గిరాకీ లేకపోవడంతో అటు చికెన్‌ వ్యాపారులు, పౌల్ట్రీ యాజమానులు ధరలు తగ్గిస్తున్నారు.

భోపాల్‌లో కేజీ చికెన్‌ ధర 65-69 రూపాయాలకు తగ్గింది. అటు ప్రతి రోజు 30 శాతం అమ్మకాలు కూడా జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పక్షులు చనిపోతున్నాయి. అటు వైరస్‌ సోకిన పౌల్ట్రీ ఫామ్‌కి 10 కిలోమీటర్ల పరిధిలో అమ్మకాలను నిలిపివేశారు. రాజస్థాన్‌లోనూ 50 శాతం చికెన్‌ ధరలు పడిపోయాయి. హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ సేమ్‌ సీన్‌ కనిపిస్తోంది. హర్యానాలోని పంచకుల జిల్లాలో ఏకంగా నాలుగు లక్షల కోళ్లు చనిపోయాయి. బర్డ్‌ ఫ్లూ భయంతో మాంసం అమ్మకాలు, ధరలు గణనీయంగా తగ్గాయి. బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, హర్యానా , హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించింది.

Bird Flu In India: చికెన్‌, గుడ్లపై నిషేధం.. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం.

హైదరాబాదీలు చికెన్‌ తెగ తినేస్తున్నారు.. గ్రేటర్‌లో ఒక్క రోజులో ఎంత చికెన్‌ తింటున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు