నిరసన చేస్తున్న రైతుల వల్ల దేశంలో బర్ద్ ఫ్లూ వ్యాప్తి, బిర్యానీలు తింటున్న ‘అన్నదాతలు’ రాజస్తాన్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వల్ల దేశంలో బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చునని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ ఆందోళన వ్యక్తం చేశారు.

  • Umakanth Rao
  • Publish Date - 11:16 am, Sun, 10 January 21
నిరసన చేస్తున్న రైతుల వల్ల దేశంలో బర్ద్ ఫ్లూ వ్యాప్తి, బిర్యానీలు తింటున్న 'అన్నదాతలు' రాజస్తాన్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వల్ల దేశంలో బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చునని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళు బిర్యానీలు, కాజూ బాదం తింటూ ఎంజాయ్ చేస్తున్నారని, తరచూ తమ అపియరెన్స్ లు మారుస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు దిలావర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ రైతుల్లో చాలామంది టెర్రరిస్టులు, దొంగలు, దోపిడీదారులు కూడా ఉన్నారు..అసలు వీరు అన్నదాతలకు శత్రువులు అని ఆయన దుయ్యబట్టారు. నిరసన చేస్తున్నవారికి ఈ దేశం పట్ల, దేశ ప్రజలపట్ల కనీస ఆలోచన కూడా లేదన్నారు. ఈ ప్రొటెస్ట్ కేవలం పిక్నిక్ మాత్రమే అని ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో వీరికి ప్రభుత్వం నచ్ఛజెప్పిగానీ, బలప్రయోగం ద్వారా గానీ ఢిల్లీ శివార్లనుంచి తొలగించకపోతే దేశంలో బర్ద్ ఫ్లూ వ్యాపిస్తుందన్నారు.  (ఇప్పటికే కేరళ, రాజస్తాన్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పక్షులు చనిపోతూ బర్ద్ ఫ్లూ ప్రమాదం తలెత్తిన సంగతి విదితమే).

కాగా… దిలావర్ వ్యాఖ్యలపై రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోత్సాలా మండిపడ్డారు. మనకు అన్నం పెడుతున్న అన్నదాతలపట్ల ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వీళ్ళు  ఏవియన్ సమస్యకు కారకులెలా అవుతారని ఆయన ప్రశ్నించారు.