AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీచర్ కాదు రాక్షసి.. హోంవర్క్‌ చేయలేదని ఇంత దారుణమా.. నర్సరీ విద్యార్థిని..

ఇటీవల స్కూల్‌లలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సులో వారు చేసే చిన్న తప్పులకు పెద్ద శిక్షలను విధిస్తున్నారు. స్కూల్‌కు లేట్‌గా వచ్చిందనే కారణంతో ఓ టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ తట్టుకోలేక విద్యార్థిని మరణించగా.. తాజాగా హోం వర్క్‌ చేయలేదని ఓ స్టూడెంట్‌ను ఏకంగా చెట్టుకు వేలాడదీశాడు ఓ టీచర్ ఈ దారుణ ఘటన చత్తీస్‌ఘడ్‌ జిల్లాలో వెలుగు చూసింది.

టీచర్ కాదు రాక్షసి.. హోంవర్క్‌ చేయలేదని ఇంత దారుణమా.. నర్సరీ విద్యార్థిని..
Crime News
Anand T
|

Updated on: Nov 25, 2025 | 9:04 AM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. హోం వర్క్ చేయలేదని నాలుగేళ్ల విద్యార్థిని ఉపాధ్యాయుడు చెట్టుకు కట్టి వేలాడ దీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ఉపాధ్యాయుల తీరుపై నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నారాణపూర్‌ గ్రామంలోని హన్స్ వాహిని విద్యా మందిర్‌లో ఓ విద్యార్థి నర్సిరీ చదవుతున్నాడు. అయితే సోమవారం ఉదయం యథావిధిగా ప్రారంభమైంది. విద్యార్థులు అందరూ స్కూల్‌కు వచ్చారు. క్లాసెస్‌ ప్రారంభమయ్యాయి. అప్పుడు నర్సరీ తరగతిలో, టీచర్ కాజల్ సాహు హోంవర్క్ చెక్‌ చేస్తుండగా వారిలో ఓ స్టూడెంట్‌ తన అసైన్‌మెంట్ పూర్తి చేయలేదని ఆమె గుర్తించింది. వెంటనే కోపంగా ఆ పిల్లాడిని క్లాస్‌ నుంచి బటయకు పంపింది. ఆ తర్వాత ఆ విద్యార్థికి ఎవరూ ఊహించని శిక్ష విధించింది.

చిన్న పిల్లాడనే కనీస కనికరం లేకుండా అతను షర్ట్‌ను తాడుతో కట్టి చెట్టుకు వేలాడతీసింది. ఆ పిల్లాడు గంటల తరబడి నిస్సహాయంగా వేలాడుతూ ఉన్నాడు. తనను వదిలేయాలని ఏడుస్తూ చీటర్‌ను వేడుకున్నాడు. కానీ బండరాయి అయిన ఆ టీచర్ మనసు మాత్రం కరగలేదు. దాన్ని గమనించిన కొందరు దీన్నంతా రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

విషయం తెలిసి విద్యార్థి కుటుంబ సభ్యులు వెంటనే స్కూల్‌కు చేరుకొని టీచర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చీటర్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.వీడియో వైరల్ అయిన తర్వాత, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) DS లక్రా వెంటనే పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. తదుపరి చర్యల కోసం దర్యాప్తు నివేదికను సీనియర్ అధికారులకు పంపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన తన దృష్టికి వచ్చిందని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) అజయ్ మిశ్రా ధృవీకరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.