10 వేల సంవత్సరాల్లో తొలిసారి పేలిన అగ్నిపర్వతం..విమానయాన సంస్థలు అలర్ట్!
ఇథియోపియాలోని హేలి గుబ్బి అగ్నిపర్వతం నుండి వెలువడిన బూడిద భారతదేశంలోని అనేక నగరాలను ప్రభావితం చేసింది. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు బూడిద చేరుకుంది. వాతావరణ శాఖ ఈ సంఘటనను నిశితంగా పరిశీలిస్తోంది. చాలా కాలంగా నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం ఆదివారం (నవంబర్ 23) విస్ఫోటనం చెందింది. 10,000 సంవత్సరాలలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారి. ఇది బూడిద, సల్ఫర్ డయాక్సైడ్‌తో ఆకాశంలో మందటి మేఘాలను ఏర్పరచింది.

ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం 10 వేల సంవత్సరాల తరువాత తొలిసారి పేలింది. భారీ విస్ఫోటంతో బూడిద, పొగ వేల మీటర్ల ఎత్తుకు చేరి విమాన రాకపోకలను ప్రభావితం చేసింది. కన్నూర్–అబూదాబీ విమానాన్ని ముందు జాగ్రత్త చర్యగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. బూడిద ఉత్తర భారతానికి విస్తరించే అవకాశం ఉండటంతో విమానయాన సంస్థలు అలర్ట్‌లో ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించాయి. బూడిద ఎర్ర సముద్రం దాటుకుని ఒమన్, యెమెన్ వరకు చేరడంతో ఆ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.
ఇథియోపియాలోని హేలి గుబ్బి అగ్నిపర్వతం నుండి వెలువడే భారీ బూడిద సోమవారం రాత్రి వాయువ్య భారతదేశానికి చేరుకుంది. అనేక రాష్ట్రాలలో ఆకాశాన్ని కప్పివేసింది. 10,000 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన విస్ఫోటనం నుండి వచ్చిన బూడిద రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ-ఎన్‌సిఆర్, పంజాబ్‌లకు వ్యాపించి విమాన సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో భారత సరిహద్దులోకి భారీ బూడిద మేఘం ప్రవేశించింది. ఈ మేఘం 10–15 కి.మీ ఎత్తులో గంటకు 100–120 కి.మీ వేగంతో కదులుతూనే ఉంది. అధిక ఎత్తులో ఉన్న ఈ బూడిద కారణంగా భూమిపై కాలుష్య ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఇది వాయు రవాణాపై పెద్ద ప్రభావాన్ని చూపింది.
Following the recent eruption of the #HayliGubbi volcano in #Ethiopia, ash clouds are reported to be drifting towards parts of western India. We understand that such news may cause concern, and we want to reassure you that your safety remains our highest priority.
Our teams are…
— IndiGo (@IndiGo6E) November 24, 2025
బూడిద మేఘం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండిగో సుమారు ఆరు విమానాలను రద్దు చేసింది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా, కువైట్, అబుదాబిలకు సేవలను అకాసా ఎయిర్ నిలిపివేసింది. అనేక అంతర్జాతీయ విమానాలను పాకిస్తాన్ గగనతలం ద్వారా దారి మళ్లించారు. కానీ, భారత విమానయాన సంస్థలు ఆ మార్గాన్ని ఉపయోగించలేకపోయాయి. దీని ఫలితంగా అనేకం విమానాలు ఆలస్యం, రద్దులు చేయాల్సి వచ్చింది. DGCA తక్షణ ASHTAM హెచ్చరికను జారీ చేసింది. అన్ని విమానయాన సంస్థలు బూడిద ప్రవేశించిన ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఆదేశించింది. బూడిద పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు రన్‌వేలను చెక్ చేయాలని, అవసరమైతే కార్యకలాపాలను నిలిపివేయాలని అన్ని విమానాశ్రయాలకు సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




