Kalicharan Maharaj: ఆయనో ప్రముఖుడు.. గాంధీని చంపిన గాడ్సేకు థ్యాంక్స్ చెప్పాడు.. జైలుపాలయ్యాడు..
Kalicharan Maharaj Arrest: గాంధీని చంపిన గాడ్సేకు థ్యాంక్స్ చెప్పాడు ఓ ప్రభుద్దుడు. ఇది అన్నది ఎవరో సామాన్యుడో లేక పిచ్చివాడు కాదు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆధ్యాత్మిక
Kalicharan Maharaj Arrest: గాంధీని చంపిన గాడ్సేకు థ్యాంక్స్ చెప్పాడు ఓ ప్రభుద్దుడు. ఇది అన్నది ఎవరో సామాన్యుడో లేక పిచ్చివాడు కాదు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్. అలా అన్న కొన్ని గంట్లోనే అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకెళితే.. ఆధ్మాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా జరిగిన ఓ ధర్మాచార్యుల సమ్మేళనంలో పాల్గొన్నాడు. ఆధ్మాత్మిక గురువుగా ప్రజలకు మంచి మాటలు చెప్పాల్సిందిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గాంధీని చంపిన గాడ్సేను అభినందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్సే మహాత్మ గాంధీని చంపి మంచిపనే చేశారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ధర్మ రక్షణ కోసం కట్టర్ హిందూ భావాలున్న నేతను ప్రభుత్వాధినేతను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి వక్కానిస్తూ, గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాళీచరణ్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు భగ్గుమన్నాయి.
ఈ వ్యాఖ్యలపై రాయ్‌పూర్ మాజీ మేయర్ ప్రమోద్ దూబే ఫిర్యాదు మేరకు.. కాళీ చరణ్ పై ఐపీసీ సెక్షన్ 505(2), 294 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే తనపై కేసు నమోదు కాగానే కాళీచరణ్ మహారాజ్ ఛత్తీస్‌గఢ్ నుంచి పరారయ్యారు. అయితే అతడు మధ్యప్రదేశ్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా సమాచారం మేరకు కాళీచరణ్‌ను పట్టుకునేందుకు మధ్యప్రదేశ్చేరుకున్నారు రాయ్పుర్పోలీసులు. ఖజురహో నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని బగేశ్వర్ధామ్లో ఓ అద్దె ఇంటిలో ఉన్న కాళీచరణ్మహరాజ్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇక విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సంచలన కామెంట్స్ చేశారు. అతడిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. అంతేకాదు.. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్చేయటంపై మధ్యప్రదేశ్హోంమంత్రి నరోత్తమ్మిశ్రా సంతోషంగా ఉన్నారా? బాధపడుతున్నారా? అని చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, నిబంధనల మేరకే ఛత్తీస్గఢ్పోలీసులు అరెస్ట్చేశారంటూ ఫైర్ అయ్యారు సీఎం.
Also read:
Diabetes Care: చలికాలంలో షుగర్ అదుపులో ఉండాలంటే.. ఈ పదార్థాలను తీసుకోండి..
Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?