AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర విషాదం.. పవిత్ర పండుగ వేళ 11 మంది మృతి.. ఎక్కడంటే..

బీహార్‌లోని అత్యంత పవిత్ర పండుగలలో ఒకటైన ఛత్‌ పూజ ప్రారంభోత్సవాల సందర్భంగా 'నహయ్ ఖాయ్' ఆచారాల సమయంలో విషాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో దాదాపు 11 మంది మరణించారు. వీరిలో పిల్లలు, యువకులే అధికంగా ఉన్నారు. పాట్నాలో గంగానదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు

ఘోర విషాదం.. పవిత్ర పండుగ వేళ 11 మంది మృతి.. ఎక్కడంటే..
Bihar Tragedy
Jyothi Gadda
|

Updated on: Oct 26, 2025 | 12:28 PM

Share

బీహార్‌లో ఛఠ్ పూజ ప్రారంభోత్సవాల సందర్భంగా ‘నహయ్ ఖాయ్’ ఆచారాల సమయంలో విషాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో దాదాపు 11 మంది మరణించారు. వీరిలో పిల్లలు, యువకులే అధికంగా ఉన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఛత్ పూజ ప్రారంభమైన మొదటి రోజున పాట్నాలో గంగానదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతిచెందడంతో విషాదం నెలకొంది. వైశాలిలో ఒక బాలుడు, జముయిలో ఇద్దరు యువకులు, బెగుసరాయ్‌లో ఒక యువకుడు, సీతామర్హిలో ముగ్గురు, కైమూర్‌లో ఒక బాలుడు మునిగి మరణించారు.

రాజధాని పాట్నాలోని ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బంకత్‌పూర్ గోలింద్‌పూర్ ఘాట్‌లో ముగ్గురు యువకులు మునిగిపోయారు. మృతులను సౌరవ్ కుమార్ (22), సోను కుమార్ (22) గుడ్డు కుమార్ (19) గా గుర్తించారు. ముగ్గురూ అన్నదమ్ములు, మేనల్లుళ్ళు, ఇంట్లో ఛత్ కోసం సిద్ధమవుతున్నారు. ఘాట్ శుభ్రం చేసిన తర్వాత, ముగ్గురూ గంగా నీటిని సేకరించడానికి నదిలోకి దిగారు. ఈ సమయంలో, సోను జారిపడి నీటిలో కొట్టుకుపోయాడు.. అతన్ని రక్షించే ప్రయత్నంలో, సౌరవ్, గుడ్డు కూడా అదే సుడిగుండంలో మునిగిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న DDRF, డైవింగ్ బృందం ముగ్గురి మృతదేహాలను వెలికితీసింది. ఛత్ పూజకు బదులుగా, మృతుల ఇళ్లలో శోకం మిగిల్చింది.

బీహార్‌లోని అత్యంత పవిత్ర పండుగలలో ఒకటైన ఛత్ పూజ పండుగ స్ఫూర్తిపై వరుస ప్రమాదాలు, మరణాలతో నీలినీడలు కమ్ముకున్నాయి. భక్తులు నీటి వనరుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, మరిన్ని ప్రమాదాలు జరగకుండా నదీ ఘాట్ల వెంబడి అదనపు రెస్క్యూ బృందాలను మోహరించాలని అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..