AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationships: వివాహేతర సంబంధాల్లో టాప్‌ 5 నగరాలు.. సర్వేలో షాకింగ్‌ విషయాలు!

Relationships: ఈ అక్రమ సంబంధాలు కలిగి ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. సర్వేలు పలు కీలక విషయాలు వెల్లడైనట్లు చెప్పింది. విడాకుల కేసులను వాదించే న్యాయవాదులు ఈ అక్రమ సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని..

Relationships: వివాహేతర సంబంధాల్లో టాప్‌ 5 నగరాలు.. సర్వేలో షాకింగ్‌ విషయాలు!
Subhash Goud
|

Updated on: Oct 26, 2025 | 12:45 PM

Share

Relationships: ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సంబంధాల వల్ల ప్రమాదం పొంచివున్నప్పటికీ కల్చర్‌ ఎక్కువగా పెరిగిపోతోంది. ఈ వివాహేత సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. సుఖం కోసం పరాయి పురుషుడి మోజులో స్త్రీ లేకపోతే పరాయి స్త్రీ మోజులో పురుషుడు పడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాము. అయితే ఏయే నగరాల్లో ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి అనేదానిపై ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్ ఫాం గ్లీడెన్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి.

ఇది కూడా చదవండి: SBI Card: ఇక రూ.1000 దాటితే బాదుడే.. ఎస్‌బీఐ కార్డ్‌ కొత్త ఛార్జీలు.. నవంబర్‌ 1 నుంచి అమలు!

మొదటి స్థానంలో బెంగళూరు:

ఇవి కూడా చదవండి

భారతీయ నగరాల్లో వివాహేతర సంబంధాలపై గ్లీడెన్ అనే సంస్థ ఇటీవలే సర్వే నిర్వహించింది. గ్లీడెన్ వివాహేతర అక్రమ సంబంధాల కేసులు అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో టెక్ హబ్ బెంగళూరు. ఇది మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు తర్వాత ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, పుణె నగరాలు వరుస స్థానాల్లో నిలిచాయి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో అక్రమ సంబంధాలు ఉన్న నగరంగా బెంగళూరు(20%)కేసులతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత వరుసగా ముంబయి (19%), కోల్‌కతా (18%), ఢిల్లీ (15%), పూణె (10%) ఉన్నట్లు గ్లీడెన్ సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వ్యక్తులు డేటింగ్ యాప్‌‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు సర్వేలో తేలింది.

ఐటీ, వైద్యరంగాల నిపుణులే అత్యధికం

సమాజంలో విడాకులు, కుటుంబ కలహాలు పెరగడానికి వివాహేతర సంబంధాలే ప్రధాన కారణమని సర్వే నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఐటీ, వైద్య రంగాలకు చెందిన ఉద్యోగులే వివాహేతర సంబంధాల్లో ఉన్నట్లు ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్ ఫాం గ్లీడెన్ వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 33 శాతం మంది ఒత్తిడికి గురవ్వడం, 58 శాతం మంది భావోద్వేగాల కోసం ఇలాంటి అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నట్లు గ్లీడెన్ తన నివేదికలో వెల్లడించింది. ఈ వివాహేతర సంబంధాల్లో హైదరాబాద్ నగరం అధికారికంగా టాప్ 5లో లేక పోవడం గమనార్హం.

అక్రమ సంబంధాలకు కారణాలు ఏంటి?

ఈ అక్రమ సంబంధాలు కలిగి ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. సర్వేలు పలు కీలక విషయాలు వెల్లడైనట్లు చెప్పింది. విడాకుల కేసులను వాదించే న్యాయవాదులు ఈ అక్రమ సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, కొందరి జీవితాలు చీకటిమయంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణం భావోద్వేగ అసంతృప్తి, వ్యక్తిగత అవసరాలు తీర్చకపోవడం, శారీరక – మానసిక సాన్నిహిత్యం లేకపోవడం, వివాహేతర యాప్‌ల వాడకం అని గ్లీడెన్ సంస్థ పేర్కొంది.

డేటింగ్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్లు, వినియోగదారు కార్యకలాపాల విషయానికి వస్తే టైర్ 2 నగరాలు మెట్రోల కంటే చాలా ముందున్నాయని డేటా చూపిస్తుంది. డేటా కొత్త వినియోగదారులపై మాత్రమే కాకుండా వినియోగదారు కార్యాచరణ మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: New Rules: నవంబర్ 1 నుండి జరిగే కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం చూపే అంశాలు!