AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mr Tamilnadu Death: గుండెపోటుతో ‘మిస్టర్ తమిళనాడు’ మృతి! జిమ్‌లో ట్రైనింగ్ ఇచ్చి..బాత్​రూమ్‌కు వెళ్లి..

ప్రముఖ బాడీ బిల్డర్, ‘మిస్టర్ తమిళనాడు’ టైటిల్ విన్నర్ యోగేష్ (41) గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్న యోగేష్‌ యువకులకు శిక్షణ ఇచ్చిన అనంతరం బాత్​రూమ్‌కు వెళ్లాడు. అనంతరం అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై అంబత్తూర్​మేనంపేడులోని మహాత్మా గాంధీ వీధికి చెందిన యోగేశ్​ఎన్నో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు..

Mr Tamilnadu Death: గుండెపోటుతో ‘మిస్టర్ తమిళనాడు’ మృతి! జిమ్‌లో ట్రైనింగ్ ఇచ్చి..బాత్​రూమ్‌కు వెళ్లి..
Mr Tamil Nadu Dies Of Heart Attack
Srilakshmi C
|

Updated on: Oct 10, 2023 | 6:17 PM

Share

చెన్నై, అక్టోబర్‌ 10: ప్రముఖ బాడీ బిల్డర్, ‘మిస్టర్ తమిళనాడు’ టైటిల్ విన్నర్ యోగేష్ (41) గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్న యోగేష్‌ యువకులకు శిక్షణ ఇచ్చిన అనంతరం బాత్​రూమ్‌కు వెళ్లాడు. అనంతరం అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై అంబత్తూర్​మేనంపేడులోని మహాత్మా గాంధీ వీధికి చెందిన యోగేశ్​ఎన్నో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. 2021లో యోగేష్‌ 9 బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో బాడీబిల్డింగ్‌లో ‘మిస్టర్ తమిళనాడు’ అవార్డు సైతం గెలుపొందాడు. 2021లో వైష్ణవి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది.

వివాహం అనంతరం బాడీబిల్డింగ్ ​పోటీలకు యోగేశ్ విరామం ప్రకటించాడు. ప్రస్తుతం ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటూర్ బస్​స్టేషన్​సమీపంలోని జిమ్‌కు వెళ్లి అక్కడి యువకులకు శిక్షణ ఇచ్చాడు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్ బాత్​రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికీ యోగేష్‌ బాత్‌రూం నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్కడి యువకులు బాత్‌రూం తలుపుకు పగలగొట్టి చూడగా యోగేష్‌ కిందపడి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే యువకులు అతడిని స్థానికంగా ఉన్న కిల్పౌక్​ ప్రభుత్వ ఆస్పత్రికి హూటాహుటిన తరలించగా యోగేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. యోగేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివాహం అనంతరం పోటీలకు దూరంగా ఉంటోన్న యోగేష్‌ ఒక్కసారిగా భారీ బరువులు మోయడం వల్లనే ఇలా జరిగిందని వైద్యులు అంటున్నారు.

యోగేష్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే యోగేష్ గుండెపోటుతో చనిపోవడం ఏంటని ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇటీవల కాలంలో జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎందరో యువకులు గుండెపోటుతో ప్రాణాలు పోగొట్టుకున్న వార్తలు చదువుతూనే ఉన్నాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.