AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఏమవుతుంది..? అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..

Vastu Tips: కేవలం ఆయుర్వేదంలోనే కాదు, మన భారతీయ సంప్రదాయంలోనూ, వాస్తు శాస్త్రంలోనూ వేపకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. చాలా మంది వేప చెట్టును కేవలం ఒక ఔషద మొక్కగానే చూస్తారు. కానీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు వేప చెట్టును పెంచడం వల్ల ఏ దోషం పోతుంది..? హనుమంతుడితో ఉన్న సంబంధం ఏంటీ..? అనేది తెలుసుకుందాం..

ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఏమవుతుంది..? అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..
Which Direction To Plant A Neem Tree As Per Vastu
Krishna S
|

Updated on: Feb 06, 2026 | 7:36 AM

Share

ప్రకృతిలో మనకు లభించే మొక్కలలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు.. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం కూడా అత్యంత పవిత్రమైనది. అయితే చాలా మంది వేప చెట్టును ఇంట్లో పెంచవచ్చా లేదా అని సందేహిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. వేప చెట్టుకు ప్రతికూల శక్తిని గ్రహించి, సానుకూలతను వ్యాప్తి చేసే అద్భుత శక్తి ఉంది. ఇంట్లో వేప చెట్టు ఉండటం వల్ల వాతావరణం శుద్ధి అవ్వడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత నెలకొంటుంది.

రాహు-కేతు దోషాల నుండి విముక్తి

మత విశ్వాసాల ప్రకారం.. వేప చెట్టు శని, రాహు, కేతు గ్రహాల అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. జ్యోతిష్య నిపుణుల సూచన మేరకు సరైన దిశలో వేపను నాటితే, ఈ గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.

కుజ దోషం పోవాలంటే.

వేప చెట్టును సాక్షాత్తు అంగారకుడి స్వరూపంగా భావిస్తారు. ఇంటి బయట వేప చెట్టును నాటి, దానిని సంరక్షించడం వల్ల జాతకంలోని కుజ దోషం తొలగిపోతుంది. అంతేకాకుండా వేప చెట్టును సేవించడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై శుభ ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు.

హనుమంతుడి కృప మీపై..

ఆంజనేయ స్వామికి, వేప చెట్టుకు దగ్గరి సంబంధం ఉంది. రోజూ వేప చెట్టుకు నీరు పోస్తూ, దానిని భక్తితో చూసుకునే వారికి హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా మకరం, కుంభ రాశి వారు వేప చెట్టును నాటి పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.

ఏ దిశలో నాటాలి?

వాస్తు ప్రకారం వేప చెట్టును ఎల్లప్పుడూ దక్షిణ దిశలో నాటడం అత్యంత శుభప్రదం. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వేప చెట్టును సాధ్యమైనంత వరకు ఇంటి లోపల కాకుండా ఇంటి వెలుపల నాటాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పొరపాటు అస్సలు చేయకండి..

ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ చెట్టు ఎండిపోతే, దానిని వెంటనే తొలగించి కొత్త మొక్కను నాటాలి. వాస్తు ప్రకారం.. ఎండిపోయిన చెట్టు ఇంట్లో మానసిక ఒత్తిడిని, ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.

Follow Us
'దోశ, ఇడ్లీ' పాటపై చెన్నై ఫైర్.. బీసీసీఐకి అధికారిక ఫిర్యాదు
'దోశ, ఇడ్లీ' పాటపై చెన్నై ఫైర్.. బీసీసీఐకి అధికారిక ఫిర్యాదు
పదో తరగతి ఫలితాలు 2026 విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పదో తరగతి ఫలితాలు 2026 విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఊర్లోకి వస్తే కొట్టి చంపేస్తామన్నారు.. పాపం ఈ బుల్లితెర నటి..
ఊర్లోకి వస్తే కొట్టి చంపేస్తామన్నారు.. పాపం ఈ బుల్లితెర నటి..
శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు
శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు
వాస్తు టిప్స్ : ఇంటి ముందు రావి చెట్టు ఉండటం శుభమా? అశుభమా?
వాస్తు టిప్స్ : ఇంటి ముందు రావి చెట్టు ఉండటం శుభమా? అశుభమా?
ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే..
ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే..
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన ఖరారు..!
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన ఖరారు..!
సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్
సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్
టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ.. ఐర్లాండ్ టూర్‌కు షార్ట్‌లిస్ట్
టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ.. ఐర్లాండ్ టూర్‌కు షార్ట్‌లిస్ట్
ఓటీటీలో రచ్చ లేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో రచ్చ లేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..