AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Killer: తనపై తానే సినిమా తీసుకుంటానంటున్న సీరియల్ కిల్లర్.. బికినీ హత్యలపై క్లారిటీ వచ్చేనా?

Charles Sobhraj: చార్లెస్ శోభరాజ్.. పరిచయం అక్కరలేని సీరియల్ కిల్లర్.. ప్రపంచ నేర చరిత్రలో ఆయన ఒక బ్రాండ్.. ఒక్క తీహార్ జైల్లోనే 21 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. తన పైన తానే సినిమా తీసుకుంటానని చార్లెస్ శోభరాజ్ చెబుతున్నాడు.

Serial Killer: తనపై తానే సినిమా తీసుకుంటానంటున్న సీరియల్ కిల్లర్.. బికినీ హత్యలపై క్లారిటీ వచ్చేనా?
Charles Sobhraj Making Film On Him
Rakesh Reddy Ch
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Nov 28, 2024 | 6:31 PM

Share

చార్లెస్ శోభరాజ్ ఈ పేరు ప్రపంచ నేర చరిత్రలో ఒక బ్రాండ్.. 79 ఏళ్ల చార్లెస్ 40 ఏళ్లు జైల్లోనే జీవితాన్ని గడిపాడు. ఇండియా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో వరుస హత్యలకు పాల్పడిన కరడుగట్టిన నేరస్తుడే చార్లెస్ శోభరాజ్ సీరియల్ కిల్లర్ ఎవరైనా పట్టుబడితే చార్లెస్ శోభరాజ్ స్టైల్ మోడల్స్ అంటూ పోలీస్ శాఖలను పిలుస్తూ ఉంటారు. బికినీ వేసుకున్న అమ్మాయిలను హత్య చేయడం ద్వారా ఈయనకు బికినీ కిల్లర్ అనే పేరు కూడా వచ్చింది. టూరిస్టులను టార్గెట్ చేసుకొని గోవా, థాయిలాండ్, నేపాల్ దేశాల్లో 20 కి పైగా హత్యలు చేశాడు. ఒక్క తీహార్ జైల్లోనే 21 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు చార్లెస్ శోభరాజ్.. చివరగా నేపాల్ జైలు నుంచి వృద్ధాప్యం కారణంగా విడుదలైన శోభరాజ్ ప్యారిస్‌కి వెళ్ళిపోయాడు.

గత ఏడాదిగా ప్యారిస్‌లోని ఒక హోటల్లో ఉంటున్న శోభరాజ్ తాజాగా హాల్ జజీరా ఛానల్‌కు ఫోన్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చాలా ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. “నేను నా జీవితంలో ఎవరిని చంపలేదు.. కొన్ని దేశాలకు గూడచారిగా పనిచేశాను. కేవలం పాస్‌పోర్ట్, డబ్బులు దొంగలించాను తప్ప హత్యలు చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనను 19 సంవత్సరాలు జైల్లో ఉంచిన నేపాల్ ప్రభుత్వం పైన, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ ముందు దావా వేస్తున్నట్లు”  చెప్పాడు.

ఇక దీంతోపాటు తన జీవిత చరిత్రపై తీసిన సినిమాలపై కూడా కేసులు వేస్తున్నట్లు ప్రకటించాడు. అసలు చార్లెస్ శోభరాజ్ ఏంటి? వివిధ దేశాల్లో తను చేసిన పనులేంటి? ఇన్ని కేసుల్లో ఇన్ని శిక్షలు ఎలా అనుభవించాను అనే అంశాలపై తానే ఒక సినిమా తీస్తున్నట్లుగా ఆల్ జజీరా ఛానల్‌కు చెప్పాడు. తాను చేసిన స్మగ్లింగ్, మత్తుమందులు ఇచ్చి దోచుకున్న వజ్రాలు, రాజకీయ నాయకులకు చేసిన సహాయాలు, తన నెట్‌వర్క్, వివిధ దేశాలకు తప్పుడు పాస్ పోర్టులతో ప్రయాణించిన విధానం ఇలా అన్నింటిని సినిమాలో చూపిస్తానంటున్నాడు చార్లెస్ శోభరాజ్.. ఇందుకోసం ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతున్నాడు. 2025లో భారత్ నుంచే తన డాక్యుమెంటరీ సిరీస్‌ని మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నేర జీవితం మొదలైంది ఎక్కడి నుంచంటే… భారత్, ఫ్రాన్స్ తల్లిదండ్రులకు జన్మించిన చార్లెస్ శోభరాజ్ కథ ఇక ఇండియా నుంచి చిత్రీకరణ మొదలుకానుంది. సీరియల్ కిల్లర్‌గా 8 దేశాలను గడగడలాడించిన చార్లెస్ శోభరాజ్ తన స్వీయ కథలో తాను బాధితుడిని అంటూ సమర్థించుకోవడం ఆసక్తిగా మారింది. దీంతోపాటు వివిధ దేశాలకు గూఢచారిగా పనిచేస్తానంటూ చెబుతున్న చార్లెస్ శోభరాజ్ ఎలాంటి సీక్రెట్ బయటపెడతాడు. ఎవరెవరిని వివాదాల్లోకి లాగుతాడు అనేది త్వరలో చూడాలి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి