Ration Card: రేషన్‌కార్డుదారులకు అలర్ట్‌.. డిసెంబర్‌ 31లోగా ఈ పని చేయకుంటే రేషన్‌ సరుకులు అందవు!

Ration Card: దేశంలో రేషన్ కార్డులు చాలా మందికి ఉన్నాయి. రేషన్ షాపుల ద్వారా బియ్యం, ఇతర సరుకులను అందుకుంటున్నారు. రేషన్‌ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందజేస్తుంది. తాజాగా రేషన్‌కార్డుదారులకు అలర్ట్‌ జారీ చేసింది కేంద్రం. డిసెంబర్‌ 31లోగా ఈ పని చేయకుంటే రేషన్‌ సరుకులు నిలిచిపోయే అవకాశం ఉంది..

Ration Card: రేషన్‌కార్డుదారులకు అలర్ట్‌.. డిసెంబర్‌ 31లోగా ఈ పని చేయకుంటే రేషన్‌ సరుకులు అందవు!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2024 | 5:40 PM

మీకు రేషన్‌ కార్డు ఉందా..? అయితే మీకో ముఖ్యమైన వార్త. రేషన్ కార్డ్ హోల్డర్లందరూ e-KYCని తప్పనిసరి చేయాలి. ఇ-కెవైసి చేయని రేషన్ కార్డుదారులు వారి రేషన్ కార్డు రద్దు అవుతాయి. మీరు ఇంకా eKYC చేయకుంటే, వెంటనే చేయండి, లేకపోతే జనవరి 2025 నుండి రేషన్ ప్రయోజనం ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రేషన్ కార్డుకు కేవైసీ చేసుకోవాలని రేషన్‌ డీలర్లు సైతం సూచిస్తున్నారు. కేవైసీ చేసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. వెంటనే చేసుకోవడం మంచిది. అయితే రేషన్‌ కార్డుకు కేవైసీ చేసుకోకుండా పూర్తిగా రద్దు కాకుండా తాత్కాలింగానే ఆగిపోవచ్చు.

ఇది కూడా చదవండి: December New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు.. తెలుసుకోకుంటే జేబుకు చిల్లులే..

రేషన్‌ కార్డుకు కేవైసీ డిసెంబరు 31 చివరి తేదీగా ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించింది. ప్రతి రేషన్ కార్డ్ సభ్యుడు వారి పేరు, పుట్టిన తేదీ మొదలైనవాటిని సరిపోల్చాలి. హోల్డర్లు వారి ఆధార్ డేటాతో పాటు 31 డిసెంబర్, 2024లోపు వారి e-KYC ప్రమాణీకరణను పొందకపోతే, రేషన్ కార్డ్ తాత్కాలికంగా బ్లాక్ చేయబడుతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Auto News: రూ.14.99 లక్షల కారు కేవలం రూ.5.35 లక్షలకే.. ఆఫర్‌ మిస్‌ చేసుకుంటే అంతే..

డిపార్ట్‌మెంట్ ఇ-కెవైసి పిడిఎస్ హెచ్‌పి యాప్ (ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్)ని కూడా ప్రారంభించింది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లలో Google Play Store నుండి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఇంట్లోనే e-KYC చేయవచ్చు.

దేశంలో ఎక్కడైనా ఆన్‌లైన్‌ కేంద్రంలో వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా మీ బయోమెట్రిక్‌లను ప్రామాణీకరించడం ద్వారా మీరు e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు. లేదా రేషన్‌ డీలర్ల వద్ద కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మీరు కేవైసీ చేసుకోకుండా రేషన్‌ సరుకులు నిలిచిపోవచ్చు. మీరు సమీపంలోని చౌక ధాన్యాల దుకాణాన్ని సందర్శించడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: BSNL నుంచి చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. కేవలం రూ.201తో 90 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి