AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shock: చిన్న గొడవ.. పగ పెంచుకున్న యువతి.. 60 మంది యువతుల వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టేసింది..

Shock: పంజాబ్‌లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిందో యువతి. స్నేహితులన్న కనీస కనికరం చూపలేదు.

Shock: చిన్న గొడవ.. పగ పెంచుకున్న యువతి.. 60 మంది యువతుల వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టేసింది..
Chandigarh University
Shiva Prajapati
|

Updated on: Sep 18, 2022 | 11:18 AM

Share

Shock: పంజాబ్‌లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిందో యువతి. స్నేహితులన్న కనీస కనికరం చూపలేదు. కడుపులో ఎంత విషం దాచుకుందో తెలియదుగాని.. ఏ ఆడపిల్లా చేయకూడని పని చేసింది. ఆ యువతి చేసిన దారుణానికి ఎనిమిది మంది యువతులు ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు వర్సిటీ సిబ్బంది. వీరిలో ఓ యువతి ఆరోగ్యం విషమించి మృతిచెందింది.

ఆడదే ఆడదానికి శత్రువని సామెత. పంజాబ్‌ చంఢీగడ్‌లోని ఓ ప్రైవేటు వర్సిటీలో ఆ సామెత నిజమేనని మరోసారి రుజువైంది. వందలాదిగా విద్యార్థులంతా కలిసిమెలిసి ఉంటున్నారు. అనుకోకుండా విద్యార్థుల మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో తోటి విద్యార్థులపై కక్ష పెంచుకున్న ఓ యువతి.. వారిని టార్గెట్‌ చేసింది. ఎంతలా అంటే.. వారు ఆత్మహత్య చేసుకునేంత దారుణంగా ప్రవర్తించింది. విద్యార్థినులు స్నానం చేస్తుండగా.. వీడియోలు తీసింది. అంతటితో ఆగకుండా.. వీడియోలను సిమ్లాకు చెందిన ఓ యువకుడికి పంపింది. ఆ వీడియోలను యువకుడు సోషల్‌మీడియాలో పెట్టడంతో దారుణం వెలుగుచూసింది. ఇక వీడియోలు వైరల్‌ కావడంతో ఓ విద్యార్థి హాస్టల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు యత్నించింది. ఏడుస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

బాలికల హాస్టల్‌లో 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తుండగా.. యువతి వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. తీసిన ప్రతి వీడియోను సిమ్లాకు చెందిన యువకుడికి పంపడంతో.. యువకుడు సోషల్‌ మీడియాలో పెడుతూ వస్తున్నాడు. వీడియోలు వైరల్‌ కావడంతో మనస్తాపానికి గురైన ఎనిమిది మంది యువతులు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఒకరు మృతిచెందారు. అయితే.. ఈ వీడియోల తతంగం చాలాకాలంగా సాగుతున్నట్లు సమాచారం. విద్యార్థిని వీడియోలు పంపడం.. ఆ యువకుడు సోషల్‌ మీడియాలో పెట్టడం.. కొంతకాలంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు విద్యార్థినులు. వీడియోలు వైరల్‌ కావడంపై ఆవేదన చెందుతున్నారు.

వీడియోలు వైరల్‌ చేసిన యువతిపై వర్సిటీ సిబ్బంది ఫైరయ్యారు. వీడియోలు ఎందుకు తీశావంటూ ప్రశ్నించారు. సిమ్లాలో ఉన్న యువకుడికి, నీకు ఏంటి సంబంధమంటూ నిలదీశారు. విద్యార్థినుల వైరల్‌ వీడియో ఇష్యూపై పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలను వైరల్‌ చేసిన యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే