టీవీ లైవ్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా హంతకుని అరెస్ట్

చండీగఢ్‌లో జరిగిందో విచిత్రం.. మణీందర్ సింగ్ అనే మర్దరర్ ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా అది లైవ్‌లో కొనసాగుతుండగానే మధ్యలో  పోలీసులు స్టూడియోలోకి ప్రవేశించి అతడ్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు.  సరబ్ జిత్ కౌర్ అనే నర్సును ఓ హోటల్లో కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడైన ఇతగాడు.. ఆ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. తాను ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న సరబ్ జిత్.. తన బావతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన మణీందర్.. ఆమెను […]

  • Umakanth Rao
  • Publish Date - 5:55 pm, Wed, 15 January 20
టీవీ లైవ్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా హంతకుని అరెస్ట్

చండీగఢ్‌లో జరిగిందో విచిత్రం.. మణీందర్ సింగ్ అనే మర్దరర్ ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా అది లైవ్‌లో కొనసాగుతుండగానే మధ్యలో  పోలీసులు స్టూడియోలోకి ప్రవేశించి అతడ్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు.  సరబ్ జిత్ కౌర్ అనే నర్సును ఓ హోటల్లో కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడైన ఇతగాడు.. ఆ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. తాను ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న సరబ్ జిత్.. తన బావతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన మణీందర్.. ఆమెను మాయమాటలతో ఓ హోటల్లోకి తీసుకువెళ్ళి.. హతమార్చాడట.. ఈ సంఘటన గత డిసెంబరు 30 న చండీగఢ్ లో జరిగింది.

అప్పటినుంచి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న ఇతగాడు.. ఈ న్యూస్ ఛానల్ కార్యాలయానికి వెళ్లి.. తన ‘ ఘనకార్యాన్ని ‘ చెప్పుకోవడం గమనార్హం.. 2010 లో కర్నాల్ లో తన గర్ల్ ఫ్రెండును హత్య చేసిన మణీందర్.. పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. అయితే బెయిలుపై 2014 లో విడుదలయ్యాడు. ఇప్పుడు తాజా కేసుతో బాటు పాత కేసును కూడా తిరగదోడి..ఇతనికి కోర్టు కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది.