శబరిమలలో మకరజ్యోతి దర్శనం!
శబరిమలలో అపురూప ఘట్టం సంభవించింది. పొన్నాంబలమేడు గిరులలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలనుండి జ్యోతి దర్శనానికి 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఐదురోజులు ఆలయం తెరిచే ఉంటుందని, భక్తుల దర్శనాలు కొనసాగుతాయని దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం పొన్నాంబలమేడు ప్రాంతం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసున్నారు. […]

శబరిమలలో అపురూప ఘట్టం సంభవించింది. పొన్నాంబలమేడు గిరులలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలనుండి జ్యోతి దర్శనానికి 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఐదురోజులు ఆలయం తెరిచే ఉంటుందని, భక్తుల దర్శనాలు కొనసాగుతాయని దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం పొన్నాంబలమేడు ప్రాంతం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసున్నారు. అయ్యప్ప స్వామి నామస్మరణంతో శబరి గిరులు మారుమోగుతున్నాయి.