కిమ్‌ గారి వుమెన్ సోల్జర్లా ? డ్యాన్సర్లా ? వాహ్ !

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్-జాంగ్ ఉన్ డిక్టేటరే కాదు.. డ్యాన్స్, సింగింగ్ అన్నా ఆయనకు ఎంతో ఇష్టమట ! తన సైన్యంలో బ్యూటిఫుల్ మహిళలను చేర్చుకున్న ఈయన..కాస్త విరామం దొరికితే వారి ఆటపాటలు చూస్తూ గడిపేస్తాడంటారు.. వీరంతా తమ విధుల్లో ఎలా ఉన్నారో గానీ డ్యాన్స్,  సింగింగ్ వంటి కళల్లోనూ అదుర్స్ అనిపించుకుంటున్నారు. ఈ మధ్యే సైనిక యూనిఫామ్‌లో ఉన్న ఈ మహిళా సోల్జర్స్.. ఇలా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, డ్రమ్స్, గిటార్ వాయిస్తూ తమ్ […]

  • Umakanth Rao
  • Publish Date - 7:11 pm, Wed, 15 January 20
కిమ్‌ గారి వుమెన్ సోల్జర్లా ? డ్యాన్సర్లా ? వాహ్ !

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్-జాంగ్ ఉన్ డిక్టేటరే కాదు.. డ్యాన్స్, సింగింగ్ అన్నా ఆయనకు ఎంతో ఇష్టమట ! తన సైన్యంలో బ్యూటిఫుల్ మహిళలను చేర్చుకున్న ఈయన..కాస్త విరామం దొరికితే వారి ఆటపాటలు చూస్తూ గడిపేస్తాడంటారు.. వీరంతా తమ విధుల్లో ఎలా ఉన్నారో గానీ డ్యాన్స్,  సింగింగ్ వంటి కళల్లోనూ అదుర్స్ అనిపించుకుంటున్నారు.

ఈ మధ్యే సైనిక యూనిఫామ్‌లో ఉన్న ఈ మహిళా సోల్జర్స్.. ఇలా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, డ్రమ్స్, గిటార్ వాయిస్తూ తమ్ దేశాధినేతను సంతోషంలో ముంచెత్తారు. వీరి పర్ఫార్మెన్స్ కి కిమ్ ఫిదా అయి.. చప్పట్లు కొట్టారని వేరే చెప్పాలా ? ఈ వీడియోను యుఎస్ లోని ఓ న్యూస్ ఛానల్ విడుదల చేసింది. అయితే ఇంత హంగామా లోనూ ఓ మహిళా సైనికురాలు తన తలమీద హ్యాట్ కిందకు జారిపోతుండగా దాన్ని సరిచేసుకుంటున్న దృశ్యం కనబడింది. అది  ఈ  కనువిందు సీన్‌లో..  అపశ్రుతిలా దొర్లి.. కిమ్‌ను కాస్త ఇబ్బంది పెట్టింది.