సింగర్‌గా కుక్క.. పాట వింటే ఫిదా అవ్వాల్సిందే..!
సోషల్ మీడియా.. ప్రస్తుతం దీని ప్రభావం అంతా ఇంతా కాదు. మరుగున పడి ఉన్న ఎంతో మంది టాలెంట్ కల్గిన వారిని ఒక్కసారిగా ప్రపంచానికి తెలియజేస్తుంది. మన దేశంలో అయితే ఎంతో మంది సింగర్లను కూడా ఈ సోషల్ మీడియా బాహ్యప్రపంచానికి పరిచయం చేసింది. అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అక్షర జ్ఞానం లేని అద్భుత సింగర్ బేబీ.. ఈ సోషల్ మీడియా వేదికగానే అందరికీ తెలిసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా.. రణు మొండాల్ […]

సోషల్ మీడియా.. ప్రస్తుతం దీని ప్రభావం అంతా ఇంతా కాదు. మరుగున పడి ఉన్న ఎంతో మంది టాలెంట్ కల్గిన వారిని ఒక్కసారిగా ప్రపంచానికి తెలియజేస్తుంది. మన దేశంలో అయితే ఎంతో మంది సింగర్లను కూడా ఈ సోషల్ మీడియా బాహ్యప్రపంచానికి పరిచయం చేసింది. అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అక్షర జ్ఞానం లేని అద్భుత సింగర్ బేబీ.. ఈ సోషల్ మీడియా వేదికగానే అందరికీ తెలిసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా.. రణు మొండాల్ కూడా తేరీ మేరీ సాంగ్‌తో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఆ పాటను ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తూ పాడసాగాడు. అంతే.. అక్కడే ఉన్న ఓ కుక్క కూడా అతనితో పాటుగా ఆలపించడం మొదలెట్టింది. అతనితో స్వరంతో పాటుగా.. మొరుగుతూ, అరుస్తూ ఆ కుక్క కూడా భౌభౌమంటూ పాట అందుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ కుక్క కూనీ రాగాలపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు పెడుతూ.. ఆ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.