ఢిల్లీ హైకోర్టుకెక్కిన ఉన్నావ్ రేప్ కేసు దోషి సెంగార్

యూపీలోని ఉన్నావ్ రేప్ కేసులో దోషి,  బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ ఢిల్లీ హైకోర్టుకెక్కారు. డిసెంబరు 20 న ట్రయల్ కోర్టు తనకు విధించిన యావజ్జీవ శిక్షను సవాలు చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టు ఇతనిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2017 లో అప్పుడు మైనర్ గా ఉన్న ఓ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడని సెంగార్ పై […]

ఢిల్లీ హైకోర్టుకెక్కిన ఉన్నావ్ రేప్ కేసు దోషి సెంగార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 15, 2020 | 5:59 PM

యూపీలోని ఉన్నావ్ రేప్ కేసులో దోషి,  బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ ఢిల్లీ హైకోర్టుకెక్కారు. డిసెంబరు 20 న ట్రయల్ కోర్టు తనకు విధించిన యావజ్జీవ శిక్షను సవాలు చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టు ఇతనిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2017 లో అప్పుడు మైనర్ గా ఉన్న ఓ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడని సెంగార్ పై వచ్చిన ఆరోపణలతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. అటు-బాధితురాలి కుటుంబానికి ఈ దోషి 25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది.

కుల్ దీప్ సెంగార్ మీద ట్రయల్ కోర్టు విచారణ గత ఆగస్టులో ప్రారంభమైంది. 2017  లో బాధితురాలిపై రేప్ కు పాల్పడడమే గాక.. ఆ తరువాత ఆమె కోర్టు విచారణకు కారులో తన లాయర్, ఇద్దరు మహిళలతో కలిసి వెళ్తుండగా.. ఆ వాహనాన్ని ట్రక్కుతో ఢీ కొట్టించాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ ఘటనలో బాధితురాలు, ఆమె న్యాయవాది ఇద్దరూ గాయపడగా.. ఇద్దరు మహిళలు మృతి చెందారు. బాధితురాలి తండ్రి మరణానికి   సెంగార్ కారకుడయ్యాన్న అభియోగం కూడా ఇతనిపై ఉంది.