Rajpath Road: ఢిల్లీలోని రాజ్‌పథ్ పేరు మారబోతోంది.. మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం..
ఢిల్లీలోని రాజ్‌పథ్ పేరు మారబోతోంది. కర్తవ్యపథ్‌గా మార్చాలని నిర్ణయించింది కేంద్రం. అంతేకాదు. రాజ్‌పథ్ న్యూ లుక్‌లో ఆకట్టుకుంటోంది. సెంట్రల్ విస్టా అవెన్యూను శోభాయమానంగా తీర్చిదిద్దారు. 8న ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ కొత్త హంగులు సంతరించుకుంది. అద్భుతంగా తీర్చిదిద్దిన సెంట్రల్ విస్టా అవెన్యూ అన్ని సౌకర్యాలతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 8న సెంట్రల్ విస్టా అవెన్యూను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇక రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న రోడ్డు పేరును కర్తవ్యపథ్‌గా చేంజ్ చేస్తోంది. రీ డెవలప్ చేసిన ఆ ప్రాంతం ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఐస్ క్రీం బండ్లు, వీధి వ్యాపారుల కోసం కూడా కొత్త వెండింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ విస్టా అవెన్యూ సుమారు రెండు కిలోమీటర్ల పొడువు ఉంటుంది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సెంట్రల్ విస్టాను శోభాయమానంగా తీర్చిదిద్దారు.
అయితే ఇండియా గేట్ నుంచి మన్ సింగ్ రోడ్డు వరకు ఉన్న లాన్స్‌లో పిక్నిక్స్, ఫుడ్స్‌ను అనుమతించడం లేదు. లాన్స్ వద్ద ఉన్న చిన్న చిన్న కెనాల్స్‌పై 16 పర్మినెంట్ బ్రిడ్జ్‌లను కట్టారు. రద్దీగా ఉండే జంక్షన్లలో పాదచారుల కోసం నాలుగు అండర్ పాస్‌లను నిర్మించినట్టు తెలిపారు అధికారులు.
సందర్శకుల రక్షణ కోసం 900కంటే ఎక్కువ లైట్ పోల్స్‌ను ఏర్పాటుచేశారు. బైకులు, కార్లు, క్యాబ్స్, బస్సులు, ఆటోల పార్కింగ్ కోసం వేర్వేరుగా పార్కింగ్ బేలు ఏర్పాటుచేశారు. ఇక రిపబ్లిక్ డే పరేడ్ కోసం స్పెషల్ అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి. 8న ప్రధాని మోదీ ప్రారంభించిన తర్వాత ప్రజల సందర్శనకు అనుమతిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం