Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రకు సర్వం సిద్ధం.. తమది ‘మన్ కీ బాత్’ కాదన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్

వచ్చే స్వార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దేశం మొత్తం తిరిగి ప్రజలకు పార్టీని మరింత చేరవచేసేందుకు ఆయన ఈసుదీర్థ పాదయాత్రకు..

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రకు సర్వం సిద్ధం.. తమది 'మన్ కీ బాత్' కాదన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్
Jairam Ramesh
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 05, 2022 | 9:46 PM

Bharat Jodo Yatra: వచ్చే స్వార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దేశం మొత్తం తిరిగి ప్రజలకు పార్టీని మరింత చేరవచేసేందుకు ఆయన భారత్ జోడో (Bharat Jodo)  పేరుతో సుదీర్థ పాదయాత్రకు సెప్టెంబర్ 7వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఈయాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాత్ర గీతాన్ని ఆ పార్టీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా జోడో యాత్ర ఉద్దేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఢిల్లీలోని కాగ్రెస్ పార్టీ ప్రధానకార్యాలయంలో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేశారు. మన్‌కీ బాత్‌లా తమది వన్‌వే ప్రోగ్రామ్‌ కాదని.. ప్రజల గోడు వినే యాత్ర అని పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్రలో సుదీర్ఘ ప్రసంగాలు, ప్రభోదాలు, డ్రామాలు, టెలీప్రాంప్టర్లు ఉండవని. మన్ కీ బాత్ లా వన్ వే ప్రోగ్రాం కాదని ఎద్దేవా చేశారు. ప్రజల గోడు విని వారి డిమాండ్లను దిల్లీకి చేర్చడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు. ‘మీదో అడుగు, మాదో అడుగుతో దేశాన్ని కలుపుదాం’ అనే నినాదంతో యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశం విభజనకు గురౌతోందన్న కారణంతో భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా దేశం విడిపోతోందని, రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయని.. అందుకే ఆ యాత్ర చేపడుతున్నామన్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే ఈ యాత్రలో రాహుల్‌ సహా మరికొంతమంది భారత్‌యాత్రీలు ఉంటారని చెప్పారు. ఈ యాత్రను పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 7న ప్రారంభమయ్యే ఈ యాత్రలో భాగంగా తొలుత రాహుల్‌ గాంధీ తన తండ్రి రాజీవ్‌ గాంధీకి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. కన్యాకుమారిలోని శ్రీపెరంబదూర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు స్టాలిన్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌ పాల్గొంటారని తెలిపారు. అనంతరం మహాత్మగాంధీ మండపానికి వెళతారని, అక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. వాస్తవానికి ఏడో తేదీన ప్రారంభమైనప్పటికీ 8వ తేదీ నుంచి పాదయాత్ర మొదలవుతుందన్నారు. రోజూ రెండు భాగాలుగా ఈ యాత్ర కొనసాగుతుందని, ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర నిర్వహిస్తారని చెప్పారు. రోజూ సగటున 22 నుంచి 23 కిలోమీటర్ల చొప్పున మొత్తం 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని జైరామ్‌ రమేశ్‌ వివరించారు. ప్రధాన యాత్రకు అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో చిన్న జోడో యాత్రలు నిర్వహిస్తారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..