AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. తమ అక్రమాలకు పోలీసులు అడొస్తున్నారని ఏం చేశారంటే.. వీడియో వైరల్..

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక మాఫియా ఆగడాలు ఆగడం లేదు. తమ అక్రమాలకు అడ్డువస్తే వెనక్కితగ్గే ప్రసక్తే లేదనేవిధంగా ప్రవర్తిస్తోంది ఇసుక మాఫియా. ఉత్తరప్రదేశ్ లో తాజాగా చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని సాయియాన్ పోలీస్ స్టేషన్..

Viral Video: రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. తమ అక్రమాలకు పోలీసులు అడొస్తున్నారని ఏం చేశారంటే.. వీడియో వైరల్..
Sand Mafia
Amarnadh Daneti
|

Updated on: Sep 05, 2022 | 8:58 PM

Share

Viral: ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక మాఫియా ఆగడాలు ఆగడం లేదు. తమ అక్రమాలకు అడ్డువస్తే వెనక్కితగ్గే ప్రసక్తే లేదనేవిధంగా ప్రవర్తిస్తోంది ఇసుక మాఫియా. ఉత్తరప్రదేశ్ లో తాజాగా చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని సాయియాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు రహదార్లపై బారీకెడ్లు ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లకు పోలీసులు దారి మూసేశారు. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా టోల్ గేట్ వద్ద బారీకెడ్లను ధ్వంసం చేసుకుంటూ ట్రాక్టర్లతో ముందుకు వెళ్లిపోయారు. ఒకేసారి 12 ట్రాక్టర్లు వేగంగా ముందుకు దూసుకు రావడంతో పోలీసులు ఏమిచేయలేని దీనస్థితిలో ఉండిపోయారు. వారిని ఆపేందుకు అక్కడ సిబ్బంది ప్రయత్నించినా వారివల్ల కాలేదు. టోల్ గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను ట్రాక్టర్లతో ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. 12 మంది ట్రాక్టర్ డ్రవైర్లు టోల్ రుసుం చెల్లించకుండానే మెరుపువేగంతో దూసుకెళ్లారు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా ట్రాక్టర్లను వేగంగా నడుపుతూ ముందుకెళ్లారు.

ఆగ్రాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై ఎస్‌ఎస్‌పీ ప్రభాకర్‌ చౌదరీ స్పందించారు. వారం క్రితం ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 51 ట్రక్కులను సీజ్ చేసి కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ చర్యలతో మాఫియా మకాం మార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే హైడ్రాలిక్ ట్రాలీలతో టోల్ ప్లాజా గేట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐర్ నమోదు చేసినట్లు ఎస్‌ఎస్‌పీ వివరించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులందరూ ధోల్‌పూర్ ప్రాంతానికే చెందినవారని, అక్కడి పోలీసుల సహకారంతో అందర్నీ పట్టుకుంటామన్నారు. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి. నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలు ఆగడంలేదు. తాజాగా టోల్ గేట్ వద్ద బారికేడ్లను గుద్దుకుంటూ వెళ్లిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులందరిపై చర్యలకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..