‘మొసలి కన్నీరు కార్చకండి.. దేశానికి క్షమాపణ చెప్పండి.’ విపక్షాలకు కేంద్రం డిమాండ్
పార్లమెంట్ సెక్యూరిటీ కాకుండా బయటివారి చేత తమపై నిన్న రాజ్యసభలో దౌర్జన్యం చేయించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణను ప్రభుత్వం ఖండించింది.,
పార్లమెంట్ సెక్యూరిటీ కాకుండా బయటివారి చేత తమపై నిన్న రాజ్యసభలో దౌర్జన్యం చేయించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణను ప్రభుత్వం ఖండించింది., పార్లమెంటులో ఎంపీలు తమ సమస్యలను లేవనెత్తుతారని దేశ ప్రజలు ఎంతో ఆశించారని, కానీ విపక్షాల అజెండా అంతా అరాచకమేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. పన్ను చెల్లించే ప్రజల పట్ల వారికీ శ్రద్ధ లేదని, మొసలి కన్నీరు కార్చే బదులు వారు దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్య సభలో బుధవారం ఇన్సూరెన్స్ సవరణ బిల్లుని ప్రభుత్వం ఆమోదించిన అనంతరం పెద్ద ఎత్తున రభస జరిగింది. తమ పట్ల మగ మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారని పలువురు మహిళా ఎంపీలు ఆరోపించారు. కాగా గురువారం ఉదయం రాహుల్ గాంధీ, శరద్ పవార్, మల్లిఖార్జున్ ఖర్గే, సంజయ్ రౌత్ వంటి పలువురు ప్రతిపక్ష నేతలు మొదట సమావేశం నిర్వహించి ఆ తరువాత పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి నిన్న జరిగిన ఘటనలను వివరించారు. ఎంపీలపై దౌర్జన్యం చేసినవారిపై చర్య తీసుకోవాలని ఆయనను కోరారు.
ఇలా ఉండగా ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఖండించారు., పార్లమెంటులో విపక్షాల ప్రవర్తనను దేశం యావత్తూ చూసిందన్నారు. అసలు సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై చర్య తీసుకోవాలని తాము కూడా రాజ్యసభ చైర్మన్ ని కొరినట్టు ఆయన చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. కాగా సభలో నిన్న జరిగిన ఘటనల తాలూకు 2 నిముషాల పైగా వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid Cases: కేరళలోని మలప్పురం జిల్లాలోనే కోవిడ్ కేసులు అత్యధికం.. ఎందుకంటే ..?
Viral Video: నీరజ్ చోప్రాను ఎక్కిరించిన హీరోయిన్..!! ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?? వీడియో