Mobile Coverage: దేశంలో ఎన్ని గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ ఉందంటే..? ఆసక్తికర వివరాలు
దేశంలోని 6,22,840 గ్రామాలు మొబైల్ కవరేజీని కలిగి ఉన్నట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా ఇలా సమాధానం ఇచ్చారు.
దేశంలోని మొత్తం 6,44,131 గ్రామాలలో దాదాపు 6,22,840 గ్రామాలు మొబైల్ కవరేజీని కలిగి ఉన్నట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం రాజ్యసభలో ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 6,22,840 గ్రామాల్లో 6,14,564 గ్రామాలు 30 సెప్టెంబర్, 2022 నాటికి 4G మొబైల్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN) మిషన్ కింద 4,543 నివాసాలు మొబైల్ అన్‌కవర్డ్‌గా గుర్తించినట్లు తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా ఇలా సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 31 నాటికి మొబైల్ ప్రాజెక్ట్‌ల క్రింద 1,018 మొబైల్ టవర్లు PVTG ఆవాసాలకు 4G కవరేజీని అందించడానికి రూ. 1,014 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, దేశంలోని 783 జిల్లాల్లో (అక్టోబర్ 31 నాటికి) 779 జిల్లాల్లో ఇప్పుడు 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా, దేశంలో 4.6 లక్షలకు పైగా 5G బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్‌లు (BTS) ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 5G సేవల విస్తరణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. వేలం ద్వారా మొబైల్ సేవలకు తగినంత స్పెక్ట్రమ్ కేటాయింపులు చేసినట్లు చెప్పారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSPs) దేశవ్యాప్తంగా 5G సేవలను విస్తరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి