Central Government: బరిలోకి దిగితే ఇక శత్రువులకు చుక్కలే.. భారీ ప్రాజెక్టులకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ రంగంలో మరిన్ని ప్రాజెక్టులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. భారత వైమానిక దళం, భారత సైన్యం కోసం దాదాపు రూ. 20,000 కోట్ల విలువైన రెండు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ కమిటీ (CCS) గురువారం ఆమోదం తెలిపింది.

Central Government: బరిలోకి దిగితే ఇక శత్రువులకు చుక్కలే.. భారీ ప్రాజెక్టులకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Ministry Of Defence
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 13, 2024 | 12:51 PM

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ రంగంలో మరిన్ని ప్రాజెక్టులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. భారత వైమానిక దళం కోసం 12 Su-30 MKI ఫైటర్ జెట్‌లు, భారత సైన్యం కోసం 100 K-9 వజ్ర స్వీయ చోదక (Self-propelled) హోవిట్జర్‌ల కోసం దాదాపు రూ. 20,000 కోట్ల విలువైన రెండు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ కమిటీ (CCS) గురువారం ఆమోదం తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగంలో ఈ నిధులు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. వార్తా సంస్థ ANI ప్రకారం.. రెండు ప్రాజెక్ట్‌లను CCS క్లియర్ చేసింది.. Su-30-MKI జెట్‌ల కోసం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

పన్నులు – సుంకాలతో కలిపి సుమారు రూ. 13,500 కోట్ల వ్యయంతో రక్షణ మంత్రిత్వ శాఖ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మధ్య అనుబంధ పరికరాలతో పాటు 12 Su-30MKI విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విమానం 62.6% స్వదేశీ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. భారత రక్షణ పరిశ్రమ ద్వారా తయారు చేయబడుతున్న అనేక భాగాలను మార్చడం, ఉత్పత్తి చేయడం వల్ల ఈ రంగం మరింత మెరుగుపడింది.

ఈ విమానాలు హెచ్‌ఏఎల్‌లోని నాసిక్ డివిజన్‌లో తయారు చేయనున్నారు. ఈ విమానాల సరఫరా భారత వైమానిక దళం కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.. దేశం భద్రత, రక్షణ సంసిద్ధతను బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనను విడుదల చేసింది.

ఇదిలా ఉంటే, గుజరాత్‌లోని హజీరాలో లార్సెన్ అండ్ టూబ్రో చేత 100 K-9 స్వీయ చోదక హోవిట్జర్‌లను తయారు చేసేందుకు అనుమతిచ్చారు. ఎందుకంటే భారత సైన్యం ఈ హోవిట్జర్‌ భారీ తుపాకులను మొదట్లో తన అవసరాలను తీర్చడానికి ప్రవేశపెట్టింది. అంతకుముందు మైదానాలు, ఎడారి సెక్టార్లలో ఉపయోగిస్తుంది.. కానీ ఇప్పుడు అది లడఖ్ సెక్టార్‌లో విజయవంతంగా ఉపయోగించనుంది..

దీని బరువు 50 టన్నులు, 43 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలపై 47 కిలోల బాంబులను కాల్చగలదు. ఇది సున్నా వ్యాసార్థంలో కూడా చుట్టూ తిరుగుతూ.. శుత్రువులను వేటాడుతుంది.

కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ కింద భారత సైన్యానికి 100 యూనిట్ల K9 వజ్ర-T 155 mm/52 కాలిబర్ ట్రాక్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ సిస్టమ్‌లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి L&T 2017లో రూ. 4,500 కోట్ల కాంట్రాక్ట్‌ను పొందింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..