Indian Restaurants: ప్రపంచంలో అత్యుత్తమ 7 భారతీయ రెస్టారెంట్లు.. ఈ ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి!

Indian Restaurants: మలబార్ వంటకాలకు ప్రసిద్ధి చెందిన పారగాన్ రెస్టారెంట్ కోళికోడ్ సంప్రదాయ ఆహారాన్ని అందిస్తోంది. దీని బిర్యానీ, సీఫుడ్ వంటకాలు కేరళ సంప్రదాయ రుచిని ప్రతిబింబిస్తాయి..

Indian Restaurants: ప్రపంచంలో అత్యుత్తమ 7 భారతీయ రెస్టారెంట్లు.. ఈ ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2024 | 1:49 PM

భారతదేశ ఆహార వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీరు ప్రపంచంలోని ఏ మూలలోనైనా భారతీయ ఆహారాన్ని పొందవచ్చు. కానీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన అనేక రెస్టారెంట్లు దేశంలో ఉన్నాయి. TasteAtlas దీన్ని ఆమోదించింది.

TasteAtlas ప్రపంచంలోని టాప్ 100 రెస్టారెంట్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో 7 భారతీయ రెస్టారెంట్లు తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. భారతదేశంలోని ఈ రెస్టారెంట్లు ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్నాయి.

ఈ జాబితాలో కోజికోడ్‌లోని పారగాన్ రెస్టారెంట్ 5వ స్థానంలో ఉండగా, కోల్‌కతాకు చెందిన పీటర్ క్యాట్ 7వ స్థానంలో ఉంది. ముర్తల్‌కు చెందిన అమ్రిక్ సుఖ్‌దేవ్ 13వ స్థానంలో ఉండగా, ఢిల్లీకి చెందిన కరీమ్స్ 59వ స్థానంలో నిలిచింది. ఈ రెస్టారెంట్‌ల గురించి, వాటి ప్రత్యేకత ఏమిటి ? అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

పారగాన్ రెస్టారెంట్, కోజికోడ్ – 5వ స్థానం

  • స్థాపించిన సంవత్సరం: 1939
  • ప్రసిద్ధ వంటకాలు: బిర్యానీ

మలబార్ వంటకాలకు ప్రసిద్ధి చెందిన పారగాన్ రెస్టారెంట్ కోళికోడ్ సంప్రదాయ ఆహారాన్ని అందిస్తోంది. దీని బిర్యానీ, సీఫుడ్ వంటకాలు కేరళ సంప్రదాయ రుచిని ప్రతిబింబిస్తాయి.

Indian Rrestaurant 1

పీటర్ క్యాట్, కోల్‌కతా – 7వ స్థానం:

  • స్థాపించిన సంవత్సరం: 1975
  • ప్రసిద్ధ వంటకాలు: చెలో కబాబ్

ఇండో-ఇరానియన్ వంటకాలకు ప్రసిద్ధి చెందిన పీటర్ క్యాట్ దాని రెట్రో ఇంటీరియర్, సిగ్నేచర్ చెలో కబాబ్‌కు బాగా ప్రాచుర్యం పొందింది.

Indian Rrestaurant 2

అమ్రిక్ సుఖ్‌దేవ్, ముర్తల్, హర్యానా – 13వ స్థానం

  • స్థాపించిన సంవత్సరం: 1956
  • ప్రసిద్ధ వంటకాలు: ఆలూ పరాటా

ఢిల్లీకి సమీపంలో ట్రక్కు డ్రైవర్ల దాబాగా ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ఇప్పుడు ప్రముఖ ఫుడ్ డెస్టినేషన్‌గా మారింది. దీని ఆలూ పరాఠాలు ముఖ్యంగా ప్రసిద్ధి చెందాయి.

Indian Rrestaurant 3

కరీమ్స్, న్యూఢిల్లీ – 59వ స్థానం

  • స్థాపించిన సంవత్సరం: 1913
  • ప్రసిద్ధ వంటకాలు: కోర్మా

మొఘలాయి వంటకాలకు ప్రసిద్ధి చెందిన కరీమ్స్ దాని సాంప్రదాయ వారసత్వం, రుచికరమైన కోర్మాలకు ప్రసిద్ధి చెందింది.

Indian Rrestaurant 4 సెంట్రల్ టిఫిన్ రూమ్ (CTR), బెంగళూరు – 69వ స్థానం

  • స్థాపించిన సంవత్సరం: 1952
  • ప్రసిద్ధ వంటకాలు: మసాలా దోస

దశాబ్దాలుగా ఈ రెస్టారెంట్ బెంగుళూరులో దక్షిణ భారత ఆహారానికి ఇష్టమైన ప్రదేశం.

Indian Rrestaurant 5

గులాటి, న్యూఢిల్లీ – 77వ స్థానం

  • స్థాపించిన సంవత్సరం: 1959
  • ప్రసిద్ధ వంటకాలు: బటర్ చికెన్

రాజధాని మధ్యలో ఉన్న ఈ రెస్టారెంట్ రుచికరమైన బటర్ చికెన్‌కు ప్రసిద్ధి చెందింది.

Indian Rrestaurant 6

రామ్ ఆశ్రయ్, ముంబై – 78వ స్థానం

  • స్థాపించిన సంవత్సరం: 1939
  • ప్రసిద్ధ వంటకాలు: ఉప్మా

దక్షిణ భారత వంటకాల కోసం ఈ రెస్టారెంట్ రుచికరమైన ఉప్మా, ఇతర సాంప్రదాయ వంటకాలకు ప్రసిద్ధి చెందింది.

Indian Rrestaurant 7

ఇది కూడా చదవండి: Aadhaar: మిత్రమా.. ఇంకా ఒక రోజు మాత్రమే గడువు.. ఆ తర్వాత ఏంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి