Isha Gramotsavam: ముగిసిన ఈషా గ్రామోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈషా గ్రామోత్సవం కుల, మతలా అడ్డంకులను చేధించడానికి మహిళలకు సాధికారత కల్పించడానికి, గ్రామీణ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఫైన్‌లో గెలిచిన వారికి బహుమతులు అందించిన అనంతరం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రామోత్సతవం సామాజిక పరివర్తనకు సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని...

గ్రామీణా ప్రాంతాల్లో క్రీడలో ఆసక్తిని పెంచే లక్ష్యంగా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 15వ ఈషా గ్రామోత్సవ వేడుకలు ముగిశాయి. ఫైనల్ క్రీడలను కొయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం వద్ద శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు వేడుకకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈషా గ్రామోత్సవం కుల, మతలా అడ్డంకులను చేధించడానికి మహిళలకు సాధికారత కల్పించడానికి, గ్రామీణ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఫైన్‌లో గెలిచిన వారికి బహుమతులు అందించిన అనంతరం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రామోత్సతవం సామాజిక పరివర్తనకు సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Thrilled to attend the Gramotsavam programme at @ishafoundation in the divine company of @SadhguruJV ji. It was truly a mesmerizing experience witnessing the electrifying atmosphere and the enthusiasm of the participants. I was glad to hear that more than 60,000 players have… pic.twitter.com/jqADwUwYdV
— Anurag Thakur (@ianuragthakur) September 23, 2023
ఇదిలా ఉంటే సద్గురు ఈ గ్రామోత్సవం కార్యక్రమాన్ని 2004లో ప్రారంభించారు. గ్రామీణ ప్రజల జీవితాల్లోకి క్రీడాస్ఫూర్తిని ఇంకా ఉల్లాసాన్ని తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం జరిగిన 15వ ఈషా గ్రామోత్సవ వేడుకల ముగింపు సభకు ఈషా ఫౌండేష్ వ్యవస్థాపకులు సద్గురుతో పాటు తమిళ నటుడు సంతానం, భారత మాజీ హాకీ కెప్టెన్ ధనరాజ్ పిళ్లైతో పాటు మరి కొందరు అతిథులు హాజరయ్యారు. ‘సద్గురు చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమం, గ్రామీణ క్రీడలను వేడుకగా జరుపుతోంది. ఈ క్రీడల్లో పాల్గొన్న వారిలో కొందరు కూలీలు, రైతులు, మత్య్సకారులు ఉన్నారు. కానీ నేను వారిలో క్రీడా స్ఫూర్తిని చూస్తున్నానని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.
ఇక 112 అడుగుల ఆదియోగి వద్ద నిర్వహించిన ఫైనల్ ఆకర్షణీయంగా నిలచింది. ఇక ఈషా ఫౌండేషన్ వ్యవస్థపకులు సద్గురు మాట్లాడుతూ.. ‘వేడుక స్ఫూర్తి అనేదే జీవితానికి ఆధారం, అలాగే మీరు సరదాగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి 25,000 గ్రామాలలో, 60,000 మందికి పైగా ఆటగాళ్ళను, అలాగే ఆ గ్రామాల్లోని వందలు, వేలాది ప్రేక్షకులు, ఏదో ఒక సమయంలో మైమరిచిపోయి – ఎగరడం, అరవడం, కేకలు వేయడం, నవ్వడం ఇంకా కంటతడి పెట్టడం వంటివి చేయడాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది. జీవితం గొప్పగా జరగడానికి కావాల్సింది ఇదే” అని చెప్పుకొచ్చారు.
The Grand Finale of #IshaGramotsavam is on in full flow at Isha Yoga Center, in the presence of Adiyogi. An unforgettable display of the resurgant sporting spirit of rural India. pic.twitter.com/lgwFq1niFJ
— Isha Foundation (@ishafoundation) September 23, 2023
ఇక ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ క్రీడా ఉత్సవం.. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు పుదుచ్చేరిలో జరిగియాయి. మొత్తం 194 గ్రామాల్లో జరిగిన ఈ క్రీడల్లో సుమారు 10,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు తమ రోజువారీ పనుల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతుంది. గతంలో జరిగిన గ్రామోత్సవం వేడుకల ఫైనల్స్‌లో సచిన్ టెండూల్కర్, కర్ణం మల్లేశ్వరీ వంటి క్రీడాకారులు హాజరయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..