Central Cabinet: కేంద్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం.. పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం!

క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డులను పంపిణీ చేస్తామని పేపర్‌లెస్‌, ఆన్‌లైన్‌ విధానంలో కొత్త పాన్‌కార్డు ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Central Cabinet: కేంద్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం.. పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం!
Alert For Pan Card Holders, Details In This Video
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 26, 2024 | 8:50 AM

ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో వ్యవసాయం, ఆవిష్కరణలు, విద్య, ఇంధన వరులు, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ తదితర రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పాన్‌కార్డు ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్‌ కార్డు 2.0తో డిజిటల్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డులను పంపిణీ చేస్తామని పేపర్‌లెస్‌, ఆన్‌లైన్‌ విధానంలో కొత్త పాన్‌కార్డు ఉంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది పన్ను చెల్లింపుదారులకు సేవలను సులభంగా యాక్సెస్ చేయడం, సత్వర సేవలను అందించడం, మెరుగైన నాణ్యత, డేటా కొనసాగింపు, పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది.

ఇక విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘‘వన్‌ నేషన్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌’’ స్కీమ్‌ను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ స్కీమ్‌ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీల జర్నల్స్‌, పరిశోధనా పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. స్వతంత్ర కేంద్ర ప్రాయోజిత పథకంగా ‘‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌’’ను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గంఆమోదం తెలిపింది. దీనికోసం మొత్తం రూ.2,481 కోట్లను ఖర్చు చేయనున్నారు.

ఇక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు AIM 2.0కి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది రూ.2,750 కోట్ల బడ్జెట్‌తో మార్చి 31, 2028 వరకు కొనసాగుతుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని షియోమి జిల్లాలో 240 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ పెట్టుబడి ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.1,939 కోట్ల వ్యయంతో 50 నెలల కాల వ్యవధితో ఈ ప్రాజెక్ట్‌ ఈశాన్య ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. కనెక్టివిటీని మెరుగుపరచడానికి, రూ.7,927 కోట్లతో మూడు మల్టిట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టులను క్యాబినెట్‌ మంజూరు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..