Privatisation: కేంద్ర మరో కీలక నిర్ణయం… ఆ రెండు సంస్థల్లో ఏదో ఒకటి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం..!

Privatisation: దేశంలో బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం...

Privatisation: కేంద్ర మరో కీలక నిర్ణయం... ఆ రెండు సంస్థల్లో ఏదో ఒకటి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 23, 2021 | 5:10 PM

Privatisation: దేశంలో బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా ఈ జాబితాలో ఓ బీమా కంపెనీ పేరు కూడా వినిపిస్తోంది.

ఇక దేశంలో ఎల్‌ఐసీ తర్వాత అగ్రగామిగా బీమా సంస్థగా ఉన్న ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలలో ఏదో ఒకదానిని ప్రైవేటీకరించే అవకాశలున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వీటి పేర్లను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే మూలధన సాయంతో ఈ రెండు బీమా సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఈ కంపెనీలను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.

అంతేకాకుండా ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగు పర్చేందుకు ఈ త్రైమాసికంలోనే మరో రూ.3 వేల కోట్ల మూలధన సాయం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థల్లో ఒకదానిని ప్రైవేటీకరించాలనే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లతో పాటు న్యూ ఇండియా ఇన్సురెన్స్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలపై మరి కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read: LIC Bima Jyoti Scheme: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌: ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ ‘బీమా జ్యోతి’ .. పూర్తి వివరాలు..