మహారాష్ట్రలో మంత్రి కాన్వాయ్ వాహనం చుట్టూ మూగిన జనం, ఏవీ కోవిడ్ నిబంధనలు ?

మహారాష్ట్రలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతుండగా ఓ మంత్రి మద్దతుదారులు  మాత్రం ఏ మాత్రం చలించకుండా చెలరేగిపోయారు. రాష్టంలో కఠిన ఆంక్షలు ఉన్నాయన్న విషయాన్ని..

  • Umakanth Rao
  • Publish Date - 5:14 pm, Tue, 23 February 21
మహారాష్ట్రలో మంత్రి కాన్వాయ్ వాహనం చుట్టూ మూగిన జనం, ఏవీ కోవిడ్ నిబంధనలు ?

మహారాష్ట్రలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతుండగా ఓ మంత్రి మద్దతుదారులు  మాత్రం ఏ మాత్రం చలించకుండా చెలరేగిపోయారు. రాష్టంలో కఠిన ఆంక్షలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మరిచి ఆయన కాన్వాయ్, ఆయన వాహనం చుట్టూ మూగిపోయారు. మంత్రి సంజయ్ రాథోడ్ మంగళవారం  వాషిం జిల్లాలో పోహ్రా దేవి ఆలయాన్ని విజిట్ చేసేందుకు రాగా ఆయన మద్దతుదారులతో బాటు ఇతర జనం కూడా ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. చాలామంది మాస్కులు కూడా ధరించలేదు. పెద్ద సంఖ్యలో ఉన్న వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. రాజకీయ, లేదా సామాజిక, మతపరమైన కార్యక్రమాలను నిషేధిస్తున్నామని, రాష్ట్రంలో తిరిగి లాక్ డౌన్ విధించినా విధిస్తామని సీఎం ఉద్దవ్ థాక్రే చేసిన హెచ్ఛరికలను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనబడలేదు. మాస్కులు ధరించక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆయన పదేపదే వార్నింగ్ ఇఛ్చినా ఫలితం లేకపోయింది.

అటు  స్వయంగా మంత్రి  సంజయ్ రాథోడ్ కూడా ఆయన హెచ్చరికలపట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని తేలుతోందని అంటున్నారు. కనీసం ఆయన అయినా ఈ మతపర కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి ఉందంటున్నారు. మంగళవారం రాష్ట్రంలో తాజాగా 5,210 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

Also Read:

Privatisation: కేంద్ర మరో కీలక నిర్ణయం… ఆ రెండు సంస్థల్లో ఏదో ఒకటి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం..!

ఈనెల 27న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళి, టీవీ9 యాజమాన్యానికి అభినందనలు