ఈనెల 27న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళి, టీవీ9 యాజమాన్యానికి అభినందనలు

భగవంతుడు సాక్షాత్తూ మానవాళికి ఇచ్చిన ఓ గొప్ప వరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌. ఈనెల 27 వ..

ఈనెల 27న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళి, టీవీ9 యాజమాన్యానికి అభినందనలు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 23, 2021 | 5:10 PM

భగవంతుడు సాక్షాత్తూ మానవాళికి ఇచ్చిన ఓ గొప్ప వరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌. ఈనెల 27 వ తేదీన దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళిగా శుభోదయం గ్రూప్‌ స్పాన్సర్‌ ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల్ని మాధవపెద్ది సురేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 25 వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా..పాటల రూపంలో ఇక్కడే ఉన్నారన్నారు. ఘంటసాల , బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు సంగీత ప్రపంచానికి సూర్యచంద్రులాంటి వారని శుభోదయం గ్రూప్‌ ఛైర్మన్‌ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మందికిపైగా సింగర్స్‌ పాల్గొంటారని తెలిపారు. మద్రాసు నుండి ఎంతోమంది సంగీత విద్వాంసులు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్‌ చేస్తున్న టీవీ9 యాజమాన్యానికి వాళ్లు ధన్యవాదాలు తెలిపారు.

Read also :

అగ్రవర్ణాల మహిళలకు జగన్ సర్కారు కొత్త పథకం, ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నవారికి ఏడాదికి 15 వేలు