Bheeshma Ekadasi: నేడు భీష్మ ఏకాదశి.. ఆ పాత్రలో నటించిన ఈ టాలీవుడ్ అగ్ర హీరో ఎవరో గుర్తుపట్టండి..?

టాలీవుడ్‌లో రౌధ్రంగా గర్జించే సంభాషణలు చెప్పాలన్నా, పౌరాణిక పాత్రలు వేయాలన్నా నందమూరి బాలకృష్ణ ముందువరసలో ఉంటారు. అప్పుడెప్పుడో....

Bheeshma Ekadasi: నేడు భీష్మ ఏకాదశి.. ఆ పాత్రలో నటించిన ఈ టాలీవుడ్ అగ్ర హీరో ఎవరో గుర్తుపట్టండి..?

టాలీవుడ్‌లో రౌధ్రంగా గర్జించే సంభాషణలు చెప్పాలన్నా, పౌరాణిక పాత్రలు వేయాలన్నా నందమూరి బాలకృష్ణ ముందువరసలో ఉంటారు. అప్పుడెప్పుడో వచ్చిన ‘భైరవద్వీపం’ చిత్రంలో కురూపి వేషధారణలో కనిపించిన బాలయ్య.. ఔరా అని ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో నందమూరి నటసింహం ఆ పాత్రలో నటించడం పెద్ద సాహసమనే చెప్పాలి. అప్పుడే కాదు.. ఎప్పుడైనా సరే సాహసోపేతమైన పాత్రలు ధరించాలంటే ముందుంటారు బాలయ్య.

కాగా బాలయ్య తన తండ్రి, అన్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించి ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అని రెండు భాగాలుగా విడుదల చేశారు.  అందులో ఆయన ఎన్టీఆర్ కనిపించిన అన్ని పాత్రల్లో కనిపించి మెప్పించారు. సినిమా ఫలితం ఆశించినట్టుగా లేకపోయినప్పటికీ.. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఇమిడిపోయారు. కాగా నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా చిత్రంలో భీష్ముడి గెటప్ వేసిన బాలయ్య ఫోటోను షేర్ చేసింది నిర్మాణ సంస్థ ఎన్‌బీకే ఫిల్మ్స్. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ పాత్ర తాలూకా సన్నివేశాలను ఎడిటింగ్‌లో కట్ చేశారు. కాగా ఇప్పుడు ఆ గెటప్‌ను చూసిన ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు.

“భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న ఆయన వయసుకు మించిన భీష్మ పాత్ర పోషించిన ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్న నటించిన భీష్ముని పాత్ర నాకెంతో ఇష్టం. అందుకే ‘ఎన్​టిఆర్ కథానాయకుడు’లో భీష్ముని సన్నివేశాలు తీశాం. నిడివి ఎక్కువ కావడం వల్ల వాటిని సినిమాలో ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను” అని బాలయ్య చెప్పారు.​