Pratyusha : నవ్వు, అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుని చిన్న వయసులోనే నేలరాలిన తార ప్రత్యూష వర్ధంతి
ఉజ్వలతారగా వెలగాల్సిన ఓ తార చిన్న వయసులోనే నేలరాలిపోయింది. అందం, అభినయంతో చిన్న వయసులోనే ప్రతిభగల నటిగా పేరుసంపాదించుకున్న ప్రత్యూష 23 ఫిబ్రవరి 2002న అనుమాస్పదంగా..
Pratyusha : ఉజ్వలతారగా వెలగాల్సిన ఓ తార చిన్న వయసులోనే నేలరాలిపోయింది. అందం, అభినయంతో చిన్న వయసులోనే ప్రతిభగల నటిగా పేరుసంపాదించుకున్న ప్రత్యూష 23 ఫిబ్రవరి 2002న అనుమాస్పదంగా మరణించింది. తన నవ్వుతో అందరినీ ఆకట్టుకున్న ప్రత్యూష 19 వ వర్ధంతి నేడు. ప్రత్యూష మరణం అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది. తన స్నేహితుడైన సిద్దార్ధ రెడ్డితో కలిసి కోకాకోలాలో విషయం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అయితే సిద్దార్ధ రెడ్డి మాత్రం బతికాడు.
టివి సీరియల్స్ లో నటిస్తూ ప్రత్యూష మోహన్ బాబు హీరోగా నటించిన రాయుడు సినిమాలో ఆయన కూతురుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కలుసుకోవాలని సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించి పేరు తెచ్చుకుంది. ఓ వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు తమిళంలో మంచి ఆఫర్స్ ను అందుకుంది. అందం అభినయం కలిసిన తెలుగమ్మాయి మళ్ళీ హీరోయిన్ గా వెండి తెరను ఏలనున్నది అనే ఆశలు అందరిలోనూ రేకెత్తించింది. ఐదు తెలుగు తెలుగు, పన్నెండు తమిళ సినిమాల్లో నటించింది. రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని మొదలైన సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించింది. అనేక టివి ధారావాహిక కార్యక్రమాల్లో నటించింది.
ప్రత్యూష నల్గొండ జిల్లా, భువనగిరిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆమె చిన్నప్పుడే మరణించాడు. హోటల్ మేనేజ్మెంట్ చదివింది. మోడల్ గా ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డును పొందింది. 17 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. ఆమె తల్లి సరోజినీ దేవి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె సోదరుడు ప్రణీత్ చంద్ర సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించాడు కూడా .. ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23 న తమ వివాహాన్ని పెద్దలు అంగీకరించడం లేదని తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. అదే రోజు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సిద్దార్ధ రెడ్డి మాత్రం చావును తప్పించుకున్న సంగతి తెలిసిందే.
Also Read: