Tuck Jagadish Teaser: ‘టక్ జగదీష్’ టీజర్‌తో వచ్చాడు.. టాప్ లేపుతున్నాడు.. మీరు చూశారా..?
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. టాప్ హీరోగా సత్తా చాటుతున్నాడు కథానాయకుడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. కాగా ఫిబ్రవరి 24న ఈ హీరో పుట్టినరోజు.
Tuck Jagadish Teaser: ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. టాప్ హీరోగా సత్తా చాటుతున్నాడు కథానాయకుడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. కాగా ఫిబ్రవరి 24న ఈ హీరో పుట్టినరోజు. ఈ క్రమంలో మంగళవారం నాని నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ బ్యాగ్రౌండ్ మొత్తం రాయలసీమ సాంగ్ నేపథ్యంతో అదిరిపోయింది. మంచి ఆసక్తి రేపిన ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 23న చిత్రం థియేటర్లలోకి రానుంది. సైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్‌లుక్‌ను కూడా ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారని సమాచారం. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయిలగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: