Ladakh Sector: లడఖ్ సెక్టార్‌లో పర్యటించిన సీడీఎస్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బడౌరియా
Ladakh Sector: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బడౌరియా..

Ladakh Sector: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బడౌరియా సోమ, మంగళవారం లడఖ్ సెక్టర్‌లో పర్యటించారు. వాస్తవాదీన రేఖ వెంబడి దళాలతో సమీక్షించారు. జనరల్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బడౌరియాలు సోమవారమే ఇక్కడికి చేరుకోగా, వారికి నార్తర్న్ కమాండర్, ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ వైకే జోషి, తదితరులు వారికి స్వాగతం పలికారు.
అలాగే లడఖ్ సెక్టర్‌లో పర్యటించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్వర్డ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. దేశ రక్షణలో ఆత్మ స్థైర్యంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రశంసించారు. అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ ఆవరణను సందర్శించారు. ఫీల్డ్ కమాండర్స్‌తో మాట్లాడారు. అలాగే ఆపరేషనల్ ప్రివేర్డ్‌నెస్‌ను సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు వైమానిక స్థావరాలలో మోహరించిన దళాలు, ఇతర వివరాలపై వారు సమీక్షించారు. అలాగే ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇండియన్ ఆర్మీ సిబ్బందితో కూడా ముచ్చటించారు.
Also Read: India-China Border News: చైనా జవాన్ ను తిరిగి అప్పగించిన భారత ఆర్మీ.. గత నాలుగు నెలలో ఇది రెండోసారి
